మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌‌లో రెండు అరుదైన గబ్బిలాల జాతులు

3 గంటల క్రితం

gabbilalu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 01:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మిజోరాంలో కనుగొన్న శాస్ర్తవేత్తలు

గువహతి : భారత్‌‌లో రెండు అరుదైన గబ్బిలాల జాతులు తొలిసారిగా మిజోరాంలో కనిపించినట్లు శాస్ర్తవేత్తలు పేర్కొన్నారు. షిల్లాంగ్‌‌లోని జువాలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన పరిశోధకుల బృందం భారత్‌‌లోని ఇతర సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, హంగేరీకి చెందిన నేచురల్‌ ‌హిస్టరీ మ్యూజియంకు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి ఒక అధ్యయనం నిర్వహించింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో సేకరించిన నమూనాల ఆధారంగా వీటిని కనుగొన్నారు.

ఇండో చైనీస్‌‌కు చెందిన, మందంగా బొటనవేలు కలిగిన ఒక జాతి గబ్బిలాన్ని మయన్మార్‌‌కు దాదాపు 670కిలోమీటర్ల దూరంలో, మిజోరాంలోని సెర్చిప్‌‌ జిల్లాలో కనుగొన్నారు. రెండో రకమైన ఇండో చైనీస్‌ ఎలుక వంటి చెవుల కలిగిన గబ్బిలం జాతిని వియత్నాంకు 1300 కిలోమీటర్ల దూరంలో కనుగొన్నారు. ఈ రకమైన జాతి బంగ్లాదేశ్‌‌లోని ఒక గబ్బిల జాతి జన్యు శ్రేణితో సరిపోలుతున్నందున ఈ తరహా గబ్బిలాల జాతులు ఆగ్నేయాసియా నుండి దక్షిణాసియా ప్రాంతంలో మరింత గణనీయంగా విస్తరించి వుంటాయని భావిస్తున్నారు. అలాగే వీటివల్ల ఈ ప్రాంత సుసంపన్నమైన జీవ వైవిధ్యం కూడా ప్రముఖంగా ప్రస్తావనకు రానుంది. ఈ ప్రాంతంలో మరింతగా వన్యప్రాణి సర్వేలు జరగాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతున్నాయని శాస్ర్తవేత్తలు పేర్కొన్నారు. యానిమల్‌ ‌టాక్సోనమీ అండ్‌ ఎకోలజీ జర్నల్‌‌లో ఈ అధ్యయన వివరాలను ప్రచురించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్