బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మన భూమి - మన బాధ్యత

1 గంట క్రితం

children stories
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 04:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్‌ ఫ్రెండ్స్‌, స్కూలు తెరిచిన కొన్ని రోజులకే మాకు డా. చేతన్ సోలాంకీతో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. ఆయన మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. మనం రోజూ ఉపయోగించే వస్తువుల్లో ప్లాస్టిక్‌తో తయారైనవి భూమిని ఎంతగా కలుషితం చేస్తున్నాయో వివరించారు. ఇలాగే కొనసాగితే పర్యావరణం నాశనమై, తర్వాతి తరాలకు మరింత హాని కలుగుతుందని చెప్పారు. చేతన్ సోలాంకీ గారి ప్రసంగం కేవలం ఒక క్లాస్‌ పాఠంలా కాకుండా, మా కళ్లు తెరిపించేలా సాగింది. ఆయన మాటల్లో ఎంతో జ్ఞానం, సమాజం పట్ల బాధ్యత కనిపించాయి. ‘కాలుష్యాన్ని తగ్గించకపోతే నష్టపోయేది ప్రకృతి కాదు, మనమే’ అనే నిజాన్ని ఆరోజు మేము గ్రహించాము. ఇప్పటికైనా మన అలవాట్లను మార్చుకుని, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి, నీటిని వృథా చేయకుండా ‘ధరిత్రి’ని కాపాడుకుంటామని మా తరగతి తరపున మేమంతా ప్రతిజ్ఞ చేశాం.


- ఎం. కృష్ణ విరాట్, ఆరవ తరగతి,

అరవింద హైస్కూలు, కుంచనపల్లి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్