బిజినెస్ : ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ కాల్పుల నుంచి అమెరికా ద్రవ్యోల్బణ భయాల వరకూ బులియన్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. దీంతో ఈవారం ప్రారంభంలో భారీగా పతనం అయిన బంగారం రేట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు తమ స్టాక్ మార్కెట్ నష్టాలను భర్తీ చేసుకునేందుకు గోల్డ్ అమ్మినట్లు నిపుణులు చెబుతున్న వేళ ... పసిడి రేట్లకు తిరిగి రెక్కలు వస్తున్నాయి. ఈ క్రమంలో రిటైల్ షాపింగ్ చేసేవారు తప్పనిసరిగా తమ సమీప నగరాల్లోని పెరిగిన రేట్లను తెలుసుకుని నిర్ణయం తీసుకోవటం మంచిది. జూన్ 27న బంగారం రేట్లు పెరిగాయి. జూన్ 26 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.120 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 395గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 195గా కొనసాగుతోంది. శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 27, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు పెరిగి రూ.2లక్షల 45వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
వీకెండ్ లో భారీగా పెరిగిన బంగారం ..!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)