mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరెన్సీ నోట్లపై తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు : బ్యాంక్ స్పష్టత

1 గంట క్రితం

currency notes
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 02:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : కరెన్సీ నోట్లకు సంబంధించి నెట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడేమో జూన్‌ 30 తర్వాత 2005 కంటే ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు పనిచేయవంటూ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర పేరుతో సోషల్‌ మీడియాలో ఒక సర్క్యులర్ వైరల్ అవుతోంది. దీనిపై బ్యాంక్ స్పందించింది. ‘‘ 2005 ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను జూన్ 30 తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖలలో స్వీకరించరంటూ ఆన్‌లైన్‌లో ఒక తప్పుడు సందేశం ప్రచారం అవుతోంది. ఆ సమాచారం తప్పు. వినియోగదారులు అలాంటి సమాచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాం. అలాగే ఆ తరహా సందేశాలను షేర్ చేయొద్దు. అధికారిక ఛానళ్ల నుంచి వచ్చే సమాచారంపైనే ఆధారపడాలి ’’ అని బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. అలాగే #FakeMessageAlert అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్