mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడిషనల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ కార్పొరేషన్ ఎదుట బిక్షాటన

09 జూన్, 2026

appeal-to-the-corporation-to-solve-the-problems-of-additional-workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 09, 2026, 04:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మున్సిపల్ ఫెడరేషన్ నగర అధ్యక్షులు రవి
ప్రజాశక్తి కడప అర్బన్ : అడిషనల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం)  నగర అధ్యక్షులు సుంకర రవి డిమాండ్ చేశారు. మంగళవారం కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట అడిషనల్ కార్మికులకు మూడు నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ బిక్షాటన నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకరి రవి మాట్లాడుతూ..  కార్పొరేషన్ అధికారులు అడిషనల్ కార్మికుల వేతనాలు మూడు నెలలుగా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2వ తేదీన ర్యాలీ, ధర్నా చేపట్టగా ధర్నా వద్దకు వచ్చిన అడిషనల్ కమిషనర్ శనివారం లోపు వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని  అన్నారు.  9వ తేదీ అయినా వేతనాలు చెల్లించలేదని తెలిపారు. బుధవారం ఉదయం 5:30 గంటల నుంచి గురువారం ఉదయం ఉదయం 10 గంటల వరకు ధర్నా చేపడతామని  హెచ్చరించారు. అయినప్పటికీ.. వేతనాలు చెల్లించకుంటే  అడిషనల్ కార్మికులందరితో కలిసి సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. సంయుక్త కార్యదర్శి ఇత్తడి ప్రకాష్ మాట్లాడుతూ.. కార్మికుల పట్ల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం కడప కార్పొరేషన్ అధికారులేనని  మరోసారి రుజువైందన్నారు. మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు లేవని, ఇప్పుడు స్కూళ్లు తెరుస్తున్న సమయంలోనూ అధికారులు వేతనాలు ఇవ్వాలనే ఆలోచన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. వెట్టి చాకిరి చేయిస్తున్న కడప కార్పొరేషన్ అధికారులు తక్షణం పెండింగ్ వేతనాలతో పాటు, కొత్త జీతాలతో కూడుకున్న వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్ మాట్లాడుతూ .. అడిషనల్ కమిషనర్ తీరు మారాలన్నారు. గతంలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నప్పుడు పలుమార్లు మా దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి దీక్షలు విరమింపజేసిన అడిషనల్ కమిషనర్.. ప్రతి  రోజు  పనులు చేయిస్తూ, చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ కుటుంబాలను బాధలకు, ఆవేదనకు గురిచేస్తున్నారని విమర్శించారు.   ఈ  కార్యక్రమంలో నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుపాటి శ్రీరాములు, దస్తగిరమ్మ, ధరణి, సుజాత, అమరావతి, లక్ష్మీదేవి, నగర డ్రైవర్ అధ్యక్షుడు శ్రీధర్ బాబు, కార్యదర్శి సుంకరి కిరణ్, హరి, పాదుర్తి పెంచలయ్య, గుంటగాని హరికృష్ణ, కొడవటికంటి పోలయ్య, అశోక్, కోడుమూర్తి మహేష్, మంగళ రాజు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్