mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండు తాటాకిళ్లు దగ్ధం.. రూ. ఆరు లక్షల ఆస్తి నష్టం

10 జూన్, 2026

two-palm-trees-were-burnt-causing-property-damage-of-rs-6-lakh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 10, 2026, 02:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి –ఏలేశ్వరం:  పట్టణంలోని 20వ వార్డు వారి పేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు తాటాకిళ్లు  పూర్తిగా దగ్ధమయ్యాయి. క్వారీ పనులు చేసుకుని జీవించే సీలు సుబ్బారావు, సీలు సురేష్ లకు చెందిన తాటాకిళ్లు బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.  దీంతో  రెండు కుటుంబాలు  కట్టుబట్టలతో మిగిలాయి.   స్థానికులు సమాచారంతో ప్రత్తిపాడు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే సమయానికి మొత్తం నష్టం జరిగిపోయింది.  బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం ఆరు లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్