బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమెస్సీ.. మెస్సీ... హోరేత్తిన స్టేడియం

1 గంట క్రితం

messi-1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 10:49 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఫేర్‌వెల్‌ మ్యాచ్‌లో బెనిన్‌పై అర్జెంటీనా గెలుపు

  • భావోద్వేగంతో అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై

(బ్యూనస్‌ఎయిర్‌(అర్జెంటీనా): అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోన‌ల్ మెస్సీ దేశం త‌ర‌ఫున చివ‌రి మ్యాచ్ ఆడేశాడు. అర్జెంటీనా రాజ‌ధాని బ్యూన‌స్ ఎయిర్స్‌లోని ఎస్టాడియో మోనుమెంట‌ల్ స్టేడియంలో వేలాది ప్రేక్ష‌కుల మ‌ధ్య అర్జెంటీనా, బెనిన్ జట్ల మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. త‌న వీడ్కోలు మ్యాచ్‌లో గోల్ సాధించ‌డంతో పాటు రెండు కీల‌క అసిస్ట్‌లు చేయ‌డం విశేషం. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో బెనిన్‌ను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో ఇరుజ‌ట్లు గోల్ న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో 0-0తో నిలిచాయి. అయితే రెండో అర్ధభాగం 52వ నిమిషంలో మెస్సీ పాస్ అందించ‌గా, ఒట‌మెండీ ఎలాంటి తప్పిదం చేయ‌కుండా బంతిని గోల్‌పోస్ట్‌కు త‌ర‌లించ‌డంతో అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 61వ నిమిషంలో మెస్సీ త‌న రెండో అసిస్ట్ చేయ‌గా, బంతిని అందుకున్న నికో పాజ్ మెరుపువేగంతో గోల్‌పోస్ట్‌లోకి త‌ర‌లించాడు. దీంతో అర్జెంటీనా 2-0 ఆధిక్యతలో నిలిచింది. రెండు కీల‌క పాస్‌ల‌తో అర్జెంటీనా గోల్స్ చేయ‌డంలో కీల‌పాత్ర పోషించిన మెస్సీ, మూడో గోల్‌ను తానే స్వ‌యంగా కొట్టాడు.

messi-3.jpg

మెస్సీ క‌న్నీటిప‌ర్యంతం..

ఇక మ్యాచ్ ముగిసిన అనంత‌రం మెస్సీ భావోద్వేగానికి గురయ్యాడు. 21 ఏళ్లుగా అర్జెంటీనా జ‌ట్టును త‌న భుజాల‌పై మోసిన క్ష‌ణాలు గుర్తు చేసుకుంటూ క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యాడు. అత‌డిని చూసిన అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఆ త‌ర్వాత మెస్సీ గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ.. చేతులెత్తి అభివాదం చేశాడు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున మెస్సీ.. మెస్సీ అంటూ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తింది.

2005లో ప్రొఫెష‌న‌ల్ ఫుట్‌బాల‌ర్‌గా కెరీర్ ఆరంభించిన లియోన‌ల్ మెస్సీ అర్జెంటీనా త‌ర‌ఫున 208 మ్యాచ్‌లు ఆడి 126 గోల్స్ చేశాడు. అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్య‌ధిక గోల్స్ చేసిన రెండో ఆట‌గాడిగా మెస్సీ నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో 146 గోల్స్‌తో ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఆరు ప్రపంచకప్‌లలో కలిపి మెస్సీ 21 గోల్స్‌ చేశాడు. 2014, 2022లో గోల్డెన్‌ బాల్‌, ఒకే ప్రపంచకప్‌లో (2022) గ్రూప్‌ దశ, ప్రిక్వార్టర్, క్వార్టర్‌ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో గోల్‌ చేసిన ఏకైక ప్లేయర్‌. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (34), అర్జెంటీనాకు అత్యధిక మ్యాచ్‌ల్లో (27) కెప్టెన్‌ రికార్డు మెస్సీ పేర ఉంది. అతడి సారథ్యంలో అర్జెంటీనా 2022 ఫిఫా ప్రపంచ కప్‌తో పాటు 2021, 2024 రెండు కోపా అమెరికా టైటిళ్లు సాధించింది. 2014, 2026లో అర్జెంటీనాను ర‌న్న‌ర‌ప్‌గా నిలిపిన ఘనత మెస్సీ సాధించాడు.

messi-3.jpg

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్