బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకెప్టెన్‌గా ఈశ్వరన్‌, షమీకి చోటు

1 గంట క్రితం

అభిమన్యు ఈశ్వరన్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రంజీట్రోఫీకి బెంగాల్‌, కేరళ జట్ల ప్రకటన

కోల్‌కతా: రంజీట్రోఫీ 2026-27 సీజన్‌కు బెంగాల్‌ జట్టును బెంగాల్‌ క్రికెట్‌ అకాడమీ(బిసిఎ) ప్రకటించింది. బిసిఎ ప్రకటించిన జట్టుకు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ ఎంపిక కాగా.. టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి చోటు లభించింది. కళ్యాణిలోని బెంగాల్‌ క్రికెట్‌ అకాడమీ గ్రౌండ్‌లో 11నుంచి 14వరకు బెంగాల్‌ జట్టు ఢిల్లీతో రంజీట్రోఫీ తొలి మ్యాచ్‌ ఆడనుంది. గత సీజన్‌లో అభిమన్యు ఈశ్వరన్‌ సారథ్యంలోని బెంగాల్‌ జట్టు సెమీస్‌లో చేరింది. కానీ టైటిల్‌ విజేత జమ్ము-కాశ్మీర్‌ చేతిలో సెమీస్‌లో ఓటమిపాలైంది. ఇక రంజీట్రోఫీ 2026-27 సీజన్‌ మొదటి దశ అక్టోబర్‌ 11న ప్రారంభమై నవంబర్‌ 5తో ముగియనుంది. రెండో దశ వచ్చే ఏడాది జనవరి 17నుంచి, ఫిబ్రవరి 9నుంచి నాకౌట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక కేరళ జట్టు కూడా రంజీట్రోఫీకి 18మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. విష్ణు వినోద్‌ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. ఆ జట్టు 11న తొలి లీగ్‌ మ్యాచ్‌లో జంషెడ్‌ పూర్‌లో జార్ఖండ్‌తో తలపడనుంది.

బెంగాల్‌ జట్టు: అభిమన్యు ఈశ్వరన్‌(కెప్టెన్‌), ఘరామీ(వైస్‌ కెప్టెన్‌), సుదీప్‌ ఛటర్జీ, అభిషేక్‌ పోరెల్‌, షాకిర్‌ గాంధీ(వికెట్‌ కీపర్లు), అంకుర్‌ పాల్‌, సుమంత గుప్తా, అంకిత్‌ శుక్లా, శుభమ్‌ ఛటర్జీ, మహ్మద్‌ షమీ, ఆకాశ్‌దీప్‌, ముఖేష్‌ కుమార్‌, సూరజ్‌ జైస్వాల్‌, ప్రదిప్త ప్రమాణిక్‌, అమీర్‌ గనీ, మహ్మద్‌ కైఫ్‌, సౌమ్యదీప్‌ మండల్‌. స్టాండ్‌బై: కరణ్‌ లాల్‌, అఖిలేష్‌ యాదవ్‌, గీత్‌ పురి, అభిషేక్‌ రామన్‌, శుభమ్‌ సర్కార్‌, సుమిత్‌ మొహంత, ఆదిత్య పురోహిత్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్