ఆస్ట్రేలియా అండర్-19పై టెస్ట్ సిరీస్ క్వీన్‌స్వీప్
అహ్మదాబాద్: ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ అండర్-19 జట్టు క్వీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 48పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో చేజిక్కించుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 4వికెట్ల నష్టానికి 86 పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన ఆసీస్ 151పరుగులకు ఆలౌటైంది. తన్మయ్ బలోడా(8/41) కెరీర్ అత్యుత్తమ బౌలింగ్‌లో ఆసీస్ నడ్డి విరిచాడు. ప్రియాన్షు సింగ్(2/25) కూడా బౌలింగ్‌లో రాణించాడు. ఆసీస్ బ్యాటర్లలో బ్లాక్ క్యాటిల్(63) అర్ధసెంచరీకి తోడు బ్రైన్(39), హోలిక్(13) మాత్రమే రెండంక్కెల స్కోర్ చేశారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ 43.5ఓవర్లలో ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 315పరుగులు చేసిన భారత యువ జట్టు ముందు కేవలం 11 పరుగులను మాత్రమే నిలిపింది. దానిని భారత్ కేవలం 5బంతుల్లోనే ఛేదించింది. రవిచంద్రాని(9), విర్క్(2) వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.
స్కోర్లు..
ఆస్ట్రేలియా (అండర్-19) జట్టు : 174, 151
ఇండియా (అండర్-19) జట్టు : 315, 11/0








కామెంట్‌లు (0)