ప్రజాశక్తి - విశాఖపట్నం : ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న యుజి స్పెషల్ డ్రైవ్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. మొహర్రం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవును దృష్టిలో ఉంచుకుని ఈ నెల 26న నిర్వహించాల్సిన కొన్ని డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తూ విశ్వవిద్యాలయం డిప్యూటీ రిజిస్ట్రార్ (యుజి ఎగ్జామ్స్) ఎం.పద్మరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బిఎ, బిఎస్‌సి, బిఎ (ఓరియెంటల్ లెర్నింగ్), బికామ్ (కంప్యూటర్స్ అండ్ జనరల్), బిబిఎ, బిసిఎ, బిహెచ్‌ఎం కోర్సులకు సంబంధించిన యుజి స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్స్–2026లో భాగంగా ఈ నెల 26న నిర్వహించాల్సిన సిద్ధాంత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 26న ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహించాల్సిన పరీక్షలను జులై 17న అదే సమయాల్లో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ స్పష్టం చేసింది. పరీక్ష తేదీ మాత్రమే మారిందని, పరీక్ష సమయాల్లో ఎలాంటి మార్పూ లేదని పేర్కొంది. తాజా షెడ్యూల్‌ను విద్యార్థులు గమనించి, కొత్త తేదీ ప్రకారం పరీక్షలకు హాజరు కావాలని సూచించింది.
Print Editionఎయు యుజి స్పెషల్ డ్రైవ్ పరీక్షలు వాయిదా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 12:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)