స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
విజయవాడ: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల సమస్యపై ఆందోళనకు దిగిన వైసీపీ కార్యకర్తలు, నిరుద్యోగులపై జరిగిన లాఠీఛార్జీని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, సంఘాలు, సంస్థలకు ఉన్న ప్రాథమిక హక్కు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ హక్కును నిరాకరించడం అప్రజాస్వామికమని అన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. సవాళ్లకు ప్రతి సవాళ్లతో స్పందించడం కాకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే తమ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులను ఆందోళనలకు అడ్డం పెట్టుకోవడం సమంజసం కాదని అన్నారు. నియామకాలపై వచ్చిన ఆరోపణలకు ప్రభుత్వం తగిన సమాధానాలు ఇవ్వకుండా ఉపాధ్యాయులను పోటీగా రంగంలోకి దింపడం సమస్యను మరింత జఠిలం చేస్తుందని పేర్కొన్నారు. ఇది పరస్పర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం మానుకోవాలని కోరారు.







కామెంట్‌లు (0)