మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గుజరాత్‌లో వైభవంగా 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం

1 గంట క్రితం

national film awards.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 05:46 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, ప్రముఖ మలయాళ నటుడు మమ్మూట్టికి సంయుక్తంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు

  • జాతీయ ఉత్తమ నటిగా యామీ గౌతమ్

కేవడియా (గుజరాత్): భారతీయ సినిమాలో అత్యున్నత పురస్కారాలుగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (National Film Awards) ప్రధానోత్సవ వేడుక గుజరాత్‌లోని కేవడియా (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణం)లో వైభవంగా నిర్వహించబడుతోంది. తొలిసారిగా ఢిల్లీ వెలుపల, ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఈ ప్రతిష్టాత్మక వేడుకను నిర్వహించడం విశేషం. జూలై 18న విజేతలను ప్రకటించగా, మంగళవారం (సెప్టెంబర్‌ 22) భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు ఈ పురస్కారాలను అందజేస్తున్నారు.

ప్రధాన విజేతలు ఇవే:

  • ఉత్తమ నటుడు: 'చందూ ఛాంపియన్' చిత్రానికి గాను బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, అలాగే 'భ్రమయుగం' చిత్రంలో అద్భుత నటనకు గాను మలయాళ దిగ్గజ నటుడు మమ్మూట్టి సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు.

  • ఉత్తమ నటి: 'ఆర్టికల్ 370' చిత్రంలో నటనకు గాను యామీ గౌతమ్ ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

  • ఉత్తమ ఫీచర్ ఫిలిం: యామీ గౌతమ్ నటించిన 'ఆర్టికల్ 370' ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచింది.

  • ఉత్తమ హిందీ చిత్రం: రాజ్‌కుమార్ రావ్ నటించిన 'శ్రీకాంత్' ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికైంది.

  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: భారతీయ సినిమాకు చేసిన విశేష సేవలకు గాను ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు చిత్రసీమ అత్యున్నత పురస్కారం 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డును ప్రదానం చేశారు.

సినిమా వినోదానికి పర్యాటకరంగం అనుసంధానం

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు జాతీయ సినిమా పురస్కారాల వేడుకను దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. భవిష్యత్తులో కూడా వివిధ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాల్లో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా గుజరాతీ సంస్కృతి, వంటకాలు

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన సినీ ప్రముఖులు, అతిథుల కోసం ధోక్లా, పాత్ర, ఉంధియు, ఖిచ్డీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ & లైట్ షోలు నిర్వహించనున్నారు.

72 సంవత్సరాల తర్వాత...

1954లో జాతీయ చలనచిత్ర పురస్కారాలను తొలిసారిగా ప్రారంభించినప్పుడు, కేవలం ఏడు పురస్కారాలను మాత్రమే ప్రదానం చేశారు. ఇప్పుడు, 72 సంవత్సరాల తర్వాత, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు మొత్తం 45 పురస్కారాలను ప్రదానం చేస్తున్నాయి. వీటిలో ఫీచర్ చిత్రాలకు 26, ఫీచర్ కాని చిత్రాలకు 16, సినిమాపై రచనకు రెండు, మరియు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఒకటి ఉన్నాయి. ఏడు పురస్కారాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ఇప్పుడు భారతీయ సినిమాలోని అనేక విభిన్న రంగాలను కలుపుకొని విస్తరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్