ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మద్యం కేసులో మాజీ మంత్రి ‘కారుమూరి’ అరెస్టు

1 గంట క్రితం

ed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 01:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వైసిపి నేత, ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. దీంతో, ఈ లిక్కర్‌ ‌కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురిని ఇడి అరెస్టు చేసింది. హైదరాబాద్‌ ‌కొండాపూర్‌‌లోని ఆయన నివాసానికి ఇడి అధికారులు వచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి కారుమూరిని అరెస్టు చేశారు. అక్కడ నుంచి బషీర్‌‌బాగ్‌‌లోని ఇడి కార్యాలయానికి తరలించారు. కేసు విచారణలో సేకరించిన సమాచారం మేరకు కారుమూరిని ఇడి అధికారులు ప్రశ్నించారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలపై ఇడి అధికారులు ఆరా తీశారు. అనంతరం వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. వారిలో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ కుమార్‌, ఎపి బేవరేజెస్‌ మాజీ ఎమ్‌‌డి వాసుదేవరెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్‌ ‌రెడ్డి ఉన్నారు. లిక్కర్ రవాణా టెండర్లలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్‌ను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్లు ఇడి అనుమానిస్తోంది. వైసిపి ప్రభుత్వ హయాంలో లిక్కర్‌ ‌రవాణాకు నిబంధనలకు విరుద్ధంగా కిలోమీటర్‌‌కు రూ.35 చెల్లించారని ఇడి గుర్తించింది. అంతేకాకుండా, లిక్కర్ రవాణా టెండర్లలో అనేక అక్రమాలు జరిగినట్టు ఆధారాలు సేకరించింది. హవాలా లావాదేవీలపై కూడా ఇడి దర్యాప్తు ముమ్మరం చేసింది. కారుమూరి నాగేశ్వరరావును సోమవారం ఉదయం మెజిస్ట్రేట్‌ ‌ముందు ప్రవేశపెట్టనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్