ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో ఓ అర్జీదారుడు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నాగాయలంక మండలం పరచివర గ్రామానికి చెందిన చిక్కాల సురేష్ బాబు తన పొలం వివాదంపై అనేకసార్లు పి జి ఆర్ ఎస్ లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని అసహనానికి గురయ్యాడు. కన్నీటిపర్యంతమవుతూ ... ఎస్పీ ఆఫీస్ పరిసరాలలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఆ వ్యక్తిని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు.
జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట అర్జీదారుడి ఆత్మహత్యాయత్నం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)