ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

1 గంట క్రితం

counciling.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 01:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్ : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్లందరికీ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని సూచించారు. ఈ సందర్భంగా రౌడీషీటర్లను తహసీల్దార్‌ (ఎమ్మార్వో) సమక్షంలో బైండోవర్‌ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని, ఎలాంటి గొడవలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే రాజకీయ పార్టీల ర్యాలీలు, కార్యక్రమాల్లో పాల్గొని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ధవళేశ్వరం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ టి. గణేష్‌ కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్