- టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణానికి అసలు సూత్రధారి, అంతిమ అబ్ధిదారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని టిడిపి ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణంపై తాము చేస్తున్నవి రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు కావని, నాటి ఎక్సైజ్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ న్యాయస్థానంలో స్వయంగా ఇచ్చిన వాంగ్మూలమే నిదర్శనమని అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యోదంతం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉందని, ఈ కేసులో జగన్ పాత్రపై ప్రజల్లో ఉన్న అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కాలేదని అన్నారు.
బిసిలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళ్తుంటే, దీనిని రాజకీయంగా అడ్డుకునేందుకు వైసిపి అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. రాష్ట్రంలో బిసిలు 50 శాతానికి పైగా ఉన్న నేపథ్యంలో వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.







కామెంట్లు (0)