రియాద్ : రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబరు 10న హౌతీలు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన మరో భారతీయుడు చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ వివరాలను సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని 'ఎక్స్' వేదికగా తెలిపింది. అయితే మృతుడి వివరాలను వెల్లడించలేదు. ఇదే దాడిలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ యూసఫ్ అలీ అనే భారతీయుడు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన 300 మందికి పైగా బాధితుల్లో 10 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 23న భారత రాయబార కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గాయపడిన ఇద్దరు భారతీయులు ఐసియులో, మరో ఇద్దరు సాధారణ ఆసుపత్రి వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు భారతీయులు చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. మరోవైపు, ఈ దాడిలో 12 మంది మరణించగా, 309 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత గాయపడిన భారతీయుల్లో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 14కు చేరింది.
సౌదీ విమానాశ్రయంపై హౌతీల దాడి.. మరో భారతీయుడు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 04, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)