బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఎం చంద్రబాబుకు ప్రధాని మోడి ఫోన్

1 గంట క్రితం

PM Modi calls CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 03:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో వరుసగా ఏర్పడిన అర్నబ్‌, మురసు తుపాన్ల ప్రభావంపై ఎపి సిఎం చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి బుధవారం ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తుపాన్ల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధానికి ముఖ్యమంత్రి వివరించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల వల్ల రైతులకు భారీ నష్టం వాటిల్లిందని, రోడ్లు, విద్యుత్‌ సరఫరా సహా వివిధ రంగాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని వివరించారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని మోడి ని కోరారు. తుపాను సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేసిందని ప్రధాని ప్రశంసించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్