mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పులివెందులలో వైఎస్.జగన్ పర్యటన

2 గంటల క్రితం

YS Jagan's tour of Pulivendula
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 12:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పులివెందుల : వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌.. వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. కలశ శంకుస్థాపన, స్వామివారికి నిర్వహిస్తున్న సుదర్శన హోమంలోనూ పాల్గొన్నారు. ఆలయ కార్యక్రమం అనంతరం సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకుని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం వైసిపి సీనియర్ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్