ఫిఫా : ఫిఫా ప్రపంచకప్‌లో కొలంబియా జట్టు నాకౌట్ దశలోకి ప్రవేశించింది. అయితే ఓ కొలంబియా అభిమాని మాత్రం తన దేశ జాతీయ జెండా రంగులతో రూపొందించిన ప్రత్యేక సూట్ ధరించి, మ్యాచ్ మొత్తం ఒక కుర్చీపై కదలకుండా కుడి చేతిని పైకెత్తి 90 నిమిషాల పాటు శిలావిగ్రహంలా నిలబడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. !
గ్రూప్-కె పోరులో బుధవారం కాంగోతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్-32కు అర్హత పొందింది. ఈ విజయంతో వరుసగా రెండో గెలుపును నమోదు చేసిన కొలంబియా తదుపరి దశలో చోటు దక్కించుకుంది. మ్యాచ్ మొత్తం కొలంబియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, కాంగో గోల్‌కీపర్ లియోనల్ పాసి అద్భుత ప్రతిభతో అనేక ప్రమాదకర అవకాశాలను అడ్డుకున్నాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలు కనిపించాయి. అయితే 74వ నిమిషంలో డానియెల్ మునోజ్ తెలివిగా గోల్‌కీపర్‌ను మోసం చేస్తూ బంతిని గోల్‌పోస్టులోకి పంపించి కొలంబియాకు ఆధిక్యం అందించాడు. అనంతరం కూడా కొలంబియాకు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ, పాసి మరోసారి సమర్థంగా ఎదుర్కొన్నాడు.
అందరి దృష్టి అతడిపైనే ..!
మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల్లో 90 శాతానికి పైగా మంది కొలంబియా అభిమానులే ఉన్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కాంగోకు చెందిన అభిమాని మిచెల్ కుకా మ్బోలాడింగా. తన దేశ జాతీయ జెండా రంగులతో రూపొందించిన ప్రత్యేక సూట్ ధరించి, మ్యాచ్ మొత్తం ఒక కుర్చీపై కదలకుండా కుడి చేతిని పైకెత్తి 90 నిమిషాల పాటు శిలావిగ్రహంలా నిలబడటం ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. అతని గురించి తెలుసుకుంటే ఆసక్తికర విషయం బయటపడింది. వీసా సమస్యల కారణంగా కాంగో తొలి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అతనికి దక్కలేదు. అనంతరం వీసా అనుమతి రావడంతో అమెరికాకు చేరుకున్న మిచెల్‌కు అతని ప్రత్యేక వేషధారణ కారణంగా కొలంబియా అభిమానులు కూడా ఘన స్వాగతం పలికారు. ఇదే గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్‌లో చివరి మ్యాచ్‌లో పోర్చుగల్‌తో కొలంబియా డ్రా చేసుకుంటే అగ్రస్థానంలో నాకౌట్ దశకు చేరుకుంటుంది. ఒకవేళ ఓటమి ఎదురైతే, ఇంగ్లండ్ ఉన్న గ్రూప్‌లోని రన్నరప్ జట్టుతో నాకౌట్ దశలో తలపడాల్సి ఉంటుంది.









కామెంట్‌లు (0)