mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'కార్గో' ప్రతిపాదన రద్దు చేయాలని జులై 15న చలో పలాస ఆర్డిఓ

2 గంటల క్రితం

kargo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 01:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- కాశీబుగ్గలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ప్రజాశక్తి-పలాస : ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ జూలై 15వ తేదీన చలో పలాస ఆర్డిఓ కార్యాలయం జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు తామాడ సన్యాసిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొనారి మోహనరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సి హెచ్ రవికుమార్ పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాధన రద్దు చేయాలని, పర్యావరణం పరిరక్షించాలని కోరుతూ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంకు కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు జోగి అప్పారావు అధ్యక్షతన వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్ధాన ప్రాంతంలో ఏకకాలంలో ఆరు పంటల పండుతూ అనేక అంతర పంటలు పండే అత్యంత విలువైన భూములు, మరొకవైపున తీర ప్రాంతం నుండి రక్షణ కల్పిస్తూ జిల్లాను పర్యావరణ పర్యావరణపరంగా రక్షణ కల్పిస్తున్న ఉద్దాన ప్రాంతాన్ని ఎందుకు విధ్వంసాన్ని కోరుకుంటున్నారని కేంద్ర పౌర విమానవాస శాఖ మంత్రి కేంద్రాపురం రామ్మోహన్ నాయుడుని ప్రశ్నించారు. కార్గో ఎయిర్పోర్ట్ కట్టాలని చిత్త శుద్ధి ఉంటే మూలపేట పోర్టు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాల కేటాయిస్తే బ్రహ్మాండమైన కార్గో ఎయిర్పోర్ట్ వస్తుందని, మరి ఎందుకు అక్కడ కట్టడం లేదని ప్రశ్నించారు. జిల్లాలో సరుబుజ్జిలి వైపున ధర్మ ప్లాంట్ పేరుతో వేలాది ఎకరాలు, ఇటు అణు విద్యుత్ ప్లాంట్ తో వందలాది ఎకరాలు టెక్కలి ప్రాంతంలో పోర్టు కారిడార్ పేరుతో ప్రస్తుతానికి 23 గ్రామాల నుండి 38,000 ఎకరాలు, ఉద్దాన ప్రాంతంలో ప్రస్తుతానికి సుమారు 6000 ఎకరాలు, మరొకవైపున తీర ప్రాంతం భూములన్నీ కూడా ఆదానికి కట్టబెట్టేసి ఈ జిల్లాని ఎందుకు విధ్వంసానికి కోరుకుంటున్నారని కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుని ప్రశ్నించారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ప్రజల భూములను దోపిడీ చేయడానికి ఎందుకు కోరుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టపెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా ఉన్న మీరు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు. జిల్లా సస్యశ్యామలం చేయాలంటే జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు రెండు పంటలకు నీరు ఇస్తే జల్లాసశ్యామలం అవుతుందని అన్నారు. ఎందుకు నిధులు కేటాయించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 20 నెలలుగా అవిశ్రాంతి పోరాటం జరుగుతుందని అందులో భాగంగానే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని జూన్ 25 నుండి గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి, సంతకాల సేకరించి జూలై 15వ తేదీకి అన్ని గ్రామాల నుంచి వినతి పత్రాలు తెచ్చి మహాధర్నా సందర్భంగా ఆర్డిఓకి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికైనా కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, లేకపోతే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పౌరహక్కుల సంఘం జిల్లా నాయకులు పత్తిరి దానేసు సీఐటీయూ నాయకులు యన్ గణపతి , పి ఓ డబ్ల్యూ నాయకురాలు పి కుసుమ,ఎ ఐ కె యం నాయకులు మద్దిలి రామారావు,ప్రజా సంఘాల నాయకులు జుత్తు వీరాస్వామి, జి బాలకృష్ణ,పి నాగేశ్వరావు, జనశక్తి నాయకులు కోనేరు గురయ్య,యం వినోద్ కుమార్, యస్ వీరాస్వామి, యు సోమనాదం, పి వైకుంఠరావు,దానయ్య కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు గుంటు లోకనాధం,ఎంపళ్ళ కామేశ్వరరావు, లండ రామస్వామి, వి సాంబమూర్తి,తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్