mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్ర‌ధాని మోడీతో అమెజాన్ సిఇఓ భేటీ

1 గంట క్రితం

Modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 06:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీతో నేడు అమెజాన్‌ కంపెనీ ‌సిఇఓ ఆండీ జెస్సీ ఢిల్లీలో భేటీ అయ్యారు. భారత్‌‌లో అమెజాన్‌ ‌పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. 2026 నుంచి 2030 మధ్య కాలంలో దేశంలో 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.53 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ మోడీతో సమావేశం అనంతరం ఆ కంపెనీ ప్రకటించింది. ఈ సమావేశం అనంతరం ఆండీ జెస్సీ మాట్లాడుతూ.. దశాబ్దం క్రితం భారత్‌లోకి అడుగుపెట్టామ‌ని, అప్పటి నుంచి ఈ-కామర్స్, ఏఐ, క్లౌడ్ వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధిని చూస్తున్నామ‌ని అన్నారు. ప్రధాని మోడీ దార్శనికత అయిన ‘వికసిత్ భారత్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాల సాధనకు కట్టుబడి ఉన్నామ‌ని చెప్పారు. భారత్ వృద్ధి ప్రస్థానంలో దీర్ఘకాలిక భాగస్వామిగా కొనసాగుతామ‌ని స్పష్టంచేశారు. ఈ కొత్త పెట్టుబడులతో కలిపి 2010 నుంచి 2030 వరకు భారత్‌లో అమెజాన్ పెట్టిన మొత్తం పెట్టుబడుల విలువ 88 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్