ముంబై : మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్‌లో భాగంగా శివసేన (యుబిటి) పార్టీ ఆరుగురు ఎంపీలు అధికార ఏక్‌నాథ్ షిండే (శివసేన) పార్టీలోకి మారడంతో ఉద్దశ్‌ఠాక్రే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెదిరిపోకుండా చూసేందుకు ఠాక్రే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి శ్రీకాకం చుట్టారు. పార్టీ మారిన ఆరుగురు ఎంపీల నియోజకవర్గాలతోపాటు, మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచార కార్య్రకమం జూన్ 27 నుంచి 29 వరకు మూడురోజుల పాటు జరగనుంది. మొదటగా ఠాక్రే జూన్ 27న యవత్మాల్ పర్యటనతో తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విదర్భలోని వాషిమ్, మరాఠ్వాడా ప్రాంతంలోని హింగోలిని సందర్శిస్తారు. ఇక జూన్ 28న పర్భనీ మరియు ధారాశివ్‌లలో పర్యటించనున్నారు. ఆ తర్వాత జూన్ 29న షిర్డీని సందర్శించనున్నారు.
కాగా, ముంబై నార్త్ ఈస్ట్ ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్, హింగోలీ ఎంపీ నగేష్ పాటిల్ అస్తికర్, పర్భానీ ఎంపీ సంజయ్ జాదవ్, షిర్డీ ఎంపీ భౌసాహెబ్ వాక్‌చౌరే, ముంబై నార్త్ ఈస్ట్ ఎంపీ సంజయ్ దిన పాటిల్, ఉస్మానాబాద్ ఎంపీ ఓంప్రకాష్ రాజే నింబాల్కర్ సేన (యుబిటి)లు ఠాక్రే శివసేన పార్టీ నుంచి.. ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీలోకి మారుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అస్తికార్, నింబాల్కర్‌లు షిండే వర్గంలోకి మారారని అధికారికంగా ప్రకటించారు.









కామెంట్‌లు (0)