గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరిషత్ పోలింగ్‌లో సిపిఎం అభ్యర్థులపై దాడులు

1 గంట క్రితం

పరిషత్ పోలింగ్‌లో  సిపిఎం అభ్యర్థులపై దాడులు
-  ఓటర్లపై దౌర్జన్యాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 11:29 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఓటర్లపై దౌర్జన్యాలు

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో జరిగిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల పోలింగ్‌లో అధికార కూటమి నేతలు తమ అధికార బలాన్ని ఉపయోగించి ప్రత్యర్థులపై దాడులు చేస్తూ ఓటర్లను భయబ్రాంతులకు గురిచేశారు. పోలీసు బలగాలను ఉపయోగించి సిపిఎం అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు.పార్టీ సానుభూతిపరులైన ఓటర్లకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

కర్నూలు రూరల్ మండలం ఉల్చాల సిపిఎం ఎంపిటిసి -1 అభ్యర్థి రాఘవేంద్ర పై అధికార పార్టీ నేతలు, పోలీసులు దాడులకు పాల్పడ్డారు. ఊరిలో గొడవలు సృష్టించడానికి పోటీ చేసావా? అంటూ పోలింగ్‌ బూతు నుంచి రాఘవేంద్ర షర్ట్‌ కాలర్‌ పట్టుకుని ఎస్‌ఐ బయటకు లాక్కొచ్చారు. అనంతరం ఎస్‌ఐ, టిడిపి అభ్యర్థి వెంకటేశ్వర్లు దాడులకు పాల్డడ్డారు. అలాగే పోలింగ్‌ ఏజెంట్‌ ప్రకాష్‌పైన దాడి చేశారు. ఈ చర్యలను సిపిఎం కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు, టిడిపి అభ్యర్థులు వెనక్కి తక్కారు. సిపిఎం పార్టీకి చెందిన ఓటర్లు కనిపిస్తే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, స్లిప్పులు తనిఖీలు చేసిన అనంతరం వారిని పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లనిచ్చారు.

సిపిఎం అభ్యర్థికి మద్దతుగా నిలిచిన వైసిపి మాజీ ఎంపిపి వాసు వెంకటేశ్వరమ్మ, ఆమె భర్త వాసును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో సిపిఎం జెడ్‌పిటిసి అభ్యర్థి గుంటుపల్లి బాలకృష్ణ... బూత్ దగ్గర ఎన్నికల పరిశీలన చేస్తుండగా ‘మేము ఓట్లు కొనుగోలు చేశాం. ఓట్లు మాకే పడతాయి’ అంటూ కూటమి నాయకులు బాలకృష్ణ దగ్గర ఉన్న పోలింగ్ గుర్తింపు కార్డును లాక్కొని చించి వేశారు. అంతేకాకుండా పోలింగ్ బూత్ లోని సిపిఎం ఏజెంట్ నాగమల్లేశ్వరరావు గుర్తింపు కార్డు లాక్కొని దాడికి పాల్పడ్డారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో 50 మందికి పైగా టిడిపి నాయకులు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి సిపిఎం ఏజెంట్లను చొక్కాలు పట్టుకుని బలవంతంగా బయటకు లాగేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎంపిటిసి-1 నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎన్.షణ్ముఖరావును అకారణంగా పోలీసులు అరెస్టు చేసి అక్కివరం కూడలిలో విడిచిపెట్టారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు-1 ఎంపిటిసి స్థానానికి పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి షేక్‌ కరిముల్లాకు మద్దతుగా నిలిచిన సిపిఎం జిల్లా నాయకులు జె. జయంతిబాబు, కరిముల్లా మద్దతుదారులు ముప్పా సురేష్, వీరగంధం దేవేంద్రనాథ్‌ ఇళ్లపైకి టిడిపి నాయకులు దాడులకు యత్నించారు. అసభ్యపదజాలంతో దూషించారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సిపిఎం జడ్‌‌పిటిసి అభ్యర్థి గండి సునీల్ కుమార్ తల్లి ఓటు ఆమె వేయక ముందే ఓటు వేశారంటూ ఆమెను వెనక్కి పంపేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్