ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో అబద్ధాలు, అరాచకాలు, భయభ్రాంతుల ద్వారా ఓటర్లను మభ్యపెట్టి గెలవాలని వైసిపి ప్రయత్నిస్తోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు చూసిన తర్వాత మాజీ సిఎం వైఎస్ జగన్ గొడవులు సృష్టించి గెలవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారని తెలిపారు. ఇందుకు నిదర్శనంగా పులివెందులలోని ఎర్రిపల్లిలో బాంబు దాడుల ద్వారా ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. కడపలో తక్కువ పోలింగ్ నమోదు కావడం వెనుక వైసిపి, జగన్ కుట్రలే కారణమన్నారు. కడప ఎంపి అవినాష్ రెడ్డి, జగన్ కుటుం సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా బూతులలోకి ప్రవేశించారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాట్లాడే హక్కు లేదని టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక నిరాశతో ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Print Editionగొడవలకు కారణం జగనే : పల్లా
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)