గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్
Live News

తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌ అప్‌డేట్‌

8 గంటల క్రితం

c3e66c1d-5343-4d4f-a1e9-64e884b00edd.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 07:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొలి విడత గ్రామ పంచాయతీల్లో 3,191 సర్పంచ్‌ స్థానాలకు పోలింగ్‌

ఏపీలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం. మధ్యాహ్నం 1 వరకు కొనసాగనున్న పోలింగ్‌. విశాఖపట్నం, గుంటూరు మినహా 26 జిల్లాల్లో పోలింగ్. 42 డివిజన్లు, 201 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరగనుండగా, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు.


Live Updates
38 minutes agoNov 26, 2026 03:31 PM IST

గ్రామపంచాయితీ ఎన్నికలు -2026 సామర్లకోట మండలం

పూర్తి పోలింగు నివేదిక

పురుషులు :- 27443

స్త్రీలు :: -27278

ఇతరులు ::1

మొత్తం :: 54722

పోలింగు శాతం :: 78.18%

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం లో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్...

78.27 శాతం పోలింగ్ నమోదు...

మండలంలో అత్యధికంగా చొల్లంగిపేట పంచాయతీలో 87.76 శాతం, అత్యల్పంగా తాళ్ళరేవులో 70.28 శాతం పోలింగ్ నమోదు.

39 minutes agoNov 26, 2026 03:29 PM IST

కురుపాం మండలం ఉసకొండ పంచాయతీలో సర్పంచ్‌ గా ఆరిక చిన్నారావు (టీడీపీ) 394 మెజార్టీతో గెలుపు

about 1 hour agoNov 26, 2026 03:22 PM IST

రాజోలు మండలంలో 16 గ్రామాలలో ఉదయం 11:00 గంటల సమయానికి పోలింగ్ శాతం 51% ఓటింగ్ పూర్తయింది
మామిడి కుదురు మండలంలో 16 గ్రామాల పరిధిలో 183 పోలింగ్ కేంద్రాలలో50,075 ఓటర్ లకు గాను 37,021 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫైనల్ గా మామిడికుదురు మండల పరిధిలో 74 శాతం పోలింగ్ జరిగింది.

రాజోలు మండలంలో 16 గ్రామాల పరిధిలో 59154 ఓటర్లకు గాను 40,855 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజోలు మండల పరిధిలో 69.07 శాతం పోలింగ్ జరిగింది.

ఇందులో పురుషులు 20125 మంది,మహిళలు 30174 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

about 2 hours agoNov 26, 2026 02:32 PM IST

చిత్తూరు జిల్లా : జిల్లాలో మొత్తం 80.08 శాతం పోలింగ్ నమోదు

  • మధ్యాహ్నం 1 గంట సమయానికి చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు 83.11 శాతం పోలింగ్ నమోదు.

  • కుప్పం మండలంలో 85.31% పోలింగ్

కుప్పం నియోజకవర్గ పోలింగ్ శాతం.

కుప్పం 85.21%

గుడుపల్లె 84.92%

శాంతిపురం 83.11%

రామకుప్పం 81.92%



about 2 hours agoNov 26, 2026 02:30 PM IST

జరుగుమిల్లి

ప్రకాశం జిల్లా :

జరుగుమిల్లి మండలం 87.92% పోలింగ్

about 2 hours agoNov 26, 2026 02:27 PM IST

tpt

తిరుపతి జిల్లా :

శ్రీకాళహస్తి రూరల్ మండలంలో పది పంచాయతీల్లో జరుగుతున్న ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటిగంటకు 81 శాతం పోలింగ్ జరిగింది.

సత్యవేడు మండలంలో ముగిసిన పంచాయతీ

పోలింగ్.. 77.85 శాతం ఓటింగ్ నమోదు

* అత్యధికంగా చెరివిలో 94.09 శాతం, అత్యల్పంగా సత్యవేడు గ్రామంలో 61.57 శాతం పోలింగ్


about 2 hours agoNov 26, 2026 02:25 PM IST

శ్రీకాకుళం జిల్లా :

ఆమదాలవలస మున్సిపాలిటీలో మధ్యాహ్నం ఒంటిగంటకు 18276 ఓట్లు పోలై 55.27% నమోదైనట్లు అధికారులు తెలిపారు.

కంచిలి మండలంలో 69.92% పోలింగ్

పలాస - 73.42 %

వజ్రపుకొత్తూరు - 65.65%


about 2 hours agoNov 26, 2026 02:23 PM IST

గ్రామా

కాకినాడ జిల్లాలో వివిధ గ్రామ పంచాయితీలలో నమోదు అయిన పోలింగ్ శాతం

about 2 hours agoNov 26, 2026 02:04 PM IST

పోలింగ్

అన్నమయ్య జిల్లా రాయచోటి డివిజన్లోని రామాపురం, సంబేపల్లి మండలాలలో నేడు1.00గంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు


- బి.కొత్తకోట నగర పంచాయతీలో 23 వార్డులకు జరుగుతున్న కౌన్సిలర్లు ఎన్నిక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభం .ఉదయం 1 గంటల వరకు 49.75 శాతం పోలింగ్ నమోదు

about 2 hours agoNov 26, 2026 01:49 PM IST

కానూరు

కృష్ణా జిల్లా కానూరులోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నిక కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

about 2 hours agoNov 26, 2026 01:39 PM IST

పలాస

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం లండారిపుట్టుగలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. రాళ్ళతో పోలీసులపై దాడి.

about 3 hours agoNov 26, 2026 01:38 PM IST

ఓటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వ్యక్తులు.. పోలింగ్ నిలిపివేత
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లి పంచాయతీలో ఉద్రిక్తత నెలకొంది. 6, 8 వార్డుల బూతుల్లో ఇద్దరు వ్యక్తులు బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోయడంతో పోలింగ్ నిలిచిపోయింది. పోలీసులు విచారణ చేపట్టారు.

about 3 hours agoNov 26, 2026 01:24 PM IST

పోలింగ్

విజయనగరం జిల్లా: మధ్యాహ్నం ఒంటి గంటకి శృంగవరపుకోట మండలంలో 61.97 శాతం ఓటింగ్ నమోదయింది.

about 3 hours agoNov 26, 2026 01:22 PM IST

సపస్సా

ప్రశాంతంగానే ఎన్నికలు : రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు తేజ్ భరత్

విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలో మొదటి విడత పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు తేజ్ భరత్ చెప్పారు. బూసాయవలస పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలీస్ సిబ్బంది ముందస్తు ప్రణాళికలతో ప్రశాంత ఎన్నికలకు సాధ్యమవుతుందని ఎంపీడీవో రత్నం తెలిపారు.

about 3 hours agoNov 26, 2026 01:18 PM IST

ఎన్టీఆర్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి జిల్లా వ్యాప్తంగా 57.45 శాతం పోలింగ్ నమోదు

మొత్తం 3,11,318 మంది ఓటర్లకు గాను 1,78,855 మంది ఓటు హక్కు వినియోగం

అత్యధికంగా జి.కొండూరు మండలంలో 66.16 శాతం ఓటింగ్

ప్రతి ఒక్కరూ నిర్భయంగా, బాధ్యతాయుతంగా ఓటు వేయాలని కలెక్టర్ పిలుపు

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 5 మండలాల్లోని 72 గ్రామ పంచాయతీలలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని మొత్తం 959 పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఓటింగ్ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉదయం నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టర్ వివరించారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి జిల్లాలోని 5 మండలాల్లో మొత్తం 3,11,318 మంది ఓటర్లకు గాను 1,78,855 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, మొత్తం 57.45 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు.


మండలాల వారీగా నమోదైన పోలింగ్ వివరాలు:

* అత్యధికంగా జి.కొండూరు మండలంలో 66.16 శాతం పోలింగ్ నమోదు (46,569 ఓట్లకు గాను 30,812 ఓట్లు పోల్).

* మైలవరం మండలంలో 64.91 శాతం (35,522 ఓట్లు).

* ఇబ్రహీంపట్నం మండలంలో 64.79 శాతం (21,871 ఓట్లు) పోలింగ్ నమోదు.

* రెడ్డిగూడెం మండలంలో 62.03 శాతం (19,761 ఓట్లు).

* విజయవాడ రూరల్ మండలంలో 49.09 శాతం (70,889 ఓట్లు) పోలింగ్ నమోదు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఇంకా ఓటు వేయని ఓటర్లందరూ త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిర్భయంగా, బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

about 3 hours agoNov 26, 2026 01:15 PM IST

టైం అయిపాయ్..

ముగిసిన

తిరుపతి : రైల్వే కోడూరు పట్టణంలోని రెండవ వార్డు పోలింగ్ బూత్ వద్ద మధ్యాహ్నం ఒంటిగంట అనంతరం వచ్చిన ఓటర్లను పోలీసులు అనుమతించకపోవడంతో వెనుతిరిగిన ఓటర్లు.

about 3 hours agoNov 26, 2026 01:14 PM IST

కడప

సర్పంచ్ ఎన్నికల పర్యవేక్షణలో సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన

కడప : సుండుపల్లె సర్పంచ్ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ ఎస్ భావన మండలంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. వీరితోపాటు మండల తాహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో రాధాకృష్ణ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

about 3 hours agoNov 26, 2026 01:04 PM IST

పోరాటు

అన్నమయ్య జిల్లా : సంబేపల్లి మండలం, శేట్టిపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ మాజీ జ‌డ్పీటీసీ గోర్ల ఉపేంద్ర రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు. బలవంతంగా అరెస్టు చేయడం పట్ల తిరగబడ్డ గ్రామాస్తులు. పోలీసుల అదుపులో ఉపెంద్రరెడ్డి

about 3 hours agoNov 26, 2026 12:44 PM IST

అమ్మను మోస్తూ... ఓటుకు చేరే...

ఓటర్

పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో వెలగల లక్ష్మణరావు తన తల్లి అన్నమ్మను ఓటు వేయించడానికి తీసుకువస్తున్న దృశ్యం.

వోటెర్రే

పార్వతీపురం మండలం ఎం ఆర్ నగరం గ్రామంలో అలజంగి వెంకటరమణ తన తల్లిని ఓటు వేయించడానికి తీసుకెళుతున్న దృశ్యం

about 3 hours agoNov 26, 2026 12:40 PM IST

pos

local

ds


విజయనగరం జిల్లా: రాజాం మున్సిపల్ ఎన్నికల్లో హైస్కూల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న దివ్యాంగులు, వృద్ధులు

about 4 hours agoNov 26, 2026 12:31 PM IST

ఉదయం 9 గంటల వరకు 36.54 శాతం పోలింగ్ నమోదు

చిత్తూరు, నవంబర్ 26: చిత్తూరు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు జిల్లాలోని 9 మండలాల పరిధిలో ఉన్న 177 గ్రామ పంచాయతీల్లో 1,581 పోలింగ్ కేంద్రాల ద్వారా 36.54 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో మొత్తం 4,11,159 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 1,50,255 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 76,728 మంది పురుషులు, 73,527 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే బైరెడ్డిపల్లి మండలంలో 40.78 శాతం, గంగవరం మండలంలో 37.42 శాతం, గుడుపల్లి మండలంలో 36.31 శాతం, కుప్పం మండలంలో 36.52 శాతం, పలమనేరు మండలంలో 34.68 శాతం, పెద్దపంజాణి మండలంలో 41.34 శాతం, రామకుప్పం మండలంలో 33.85 శాతం, శాంతిపురం మండలంలో 34.07 శాతం, వి.కోట మండలంలో 34.68 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో పెద్దపంజాణి మండలంలో అత్యధికంగా 41.34 శాతం, బైరెడ్డిపల్లి మండలంలో 40.78 శాతం పోలింగ్ నమోదుకాగా, రామకుప్పం మండలంలో అత్యల్పంగా 33.85 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.

about 6 hours agoNov 26, 2026 10:11 AM IST

పల్నాడు..
పల్నాడు జిల్లా పంచాయతీ పోలింగ్‌లో ఉద్రిక్తతలు

about 6 hours agoNov 26, 2026 10:04 AM IST

కడియం మండలంలో 9 గంటలకు 30 శాతం పోలింగ్‌

ప్రజాశక్తి - కడియం: కడియం మండలంలో గురువారం ఉదయం 9 గంటల వరకు 30 శాతం పోలింగ్‌ నమోదైంది. మండలంలో మొత్తం 62,081 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 9 గంటల సమయానికి 18,534 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు.

about 6 hours agoNov 26, 2026 09:58 AM IST

కుప్పం నియోజకవర్గంలో 9 గంటలకు పోలింగ్‌ శాతం

ప్రజాశక్తి - కుప్పం: కుప్పం నియోజకవర్గంలో గురువారం ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్‌ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

కుప్పం: 36.04 శాతం

గుడుపల్లె: 37.06 శాతం

శాంతిపురం: 34.07 శాతం

రామకుప్పం: 33.85 శాతం

గుడుపల్లెలో అత్యధికంగా 37.06 శాతం పోలింగ్‌ నమోదైంది. రామకుప్పంలో అత్యల్పంగా 33.85 శాతం పోలింగ్‌ నమోదైంది.

about 6 hours agoNov 26, 2026 09:45 AM IST

సామర్ల కోట
సామర్లకోట మండలం మాధపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌

about 6 hours agoNov 26, 2026 09:44 AM IST

annamaya.jpeg

అన్నమయ్య జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

రాయచోటి: అన్నమయ్య జిల్లాలో ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంబేపల్లి మండల కేంద్రంతో పాటు రౌతుకుంటలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను పోలింగ్‌ కేంద్రాల్లోకి పోలీసులు అనుమతించలేదంటూ వైసీపీ మద్దతు ఏజెంట్లు, నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు, రౌతుకుంటలో తమ అభ్యర్థి కనిపించడం లేదంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

about 6 hours agoNov 26, 2026 09:43 AM IST

కృష్ణాజిల్లా గుడివాడ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలకు వరకు 10.5 శాతం నమోదు అయ్యింది..

about 7 hours agoNov 26, 2026 09:37 AM IST

ఇచ్ఛాపురం మండలంలో 9 గంటలకి 27.19 శాతం పోలింగ్

about 7 hours agoNov 26, 2026 09:35 AM IST

నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి హౌస్‌ అరెస్ట్‌. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శిల్పా రవి ఇంటి వద్ద పోలీసుల మోహరింపు. ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే తమ నాయకుడిని అరెస్ట్‌ చేశారంటున్న వైసీపీ నేతలు.

about 7 hours agoNov 26, 2026 09:34 AM IST

టి.నరసాపురం

పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల బారులు

ప్రజాశక్తి - టి.నరసాపురం: టి.నరసాపురం మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

about 7 hours agoNov 26, 2026 09:32 AM IST

పామూరు పోలింగ్  బూతులను పరిశీలిస్తున్న మార్కాపురం జిల్లా ఎస్పీ
పామూరు పోలింగ్ బూతులను పరిశీలిస్తున్న మార్కాపురం జిల్లా ఎస్పీ

about 7 hours agoNov 26, 2026 09:30 AM IST

పలాసలో ఇప్పటివరకు 33.83 శాతం పోలింగ్‌ నమోదైంది.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఇప్పటివరకు 33.83 శాతం పోలింగ్‌ నమోదైంది.

about 7 hours agoNov 26, 2026 09:26 AM IST

నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం
నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం

about 7 hours agoNov 26, 2026 09:20 AM IST

బి.కొత్తకోట నగర పంచాయతీ ఉదయం 9.00 గంటల వరకు నమోదైన పోలింగ్ - 12.79శాతం

about 7 hours agoNov 26, 2026 09:14 AM IST

తాడేపల్లిగూడెం కడకట్ల 42వ పోలింగ్ బూత్ వద్ద ఎనిమిది గంటలకే బారులు తీరిన ఓటర్లు
తాడేపల్లిగూడెం కడకట్ల 42వ పోలింగ్ బూత్ వద్ద ఎనిమిది గంటలకే బారులు తీరిన ఓటర్లు

about 7 hours agoNov 26, 2026 09:07 AM IST

ఫొన్నురు

పొన్నూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

పొన్నూరు : పొన్నూరు పట్టణంలోని 29వ వార్డు పరిధిలో ఉన్న 191, 192 పోలింగ్‌ బూత్‌ల వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే స్పందించిన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

about 7 hours agoNov 26, 2026 09:03 AM IST

కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మరియు జిల్లా ఎన్నికల అబ్జర్వర్ టి వెంకటేష్
విజయనగరం జిల్లా కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్

about 7 hours agoNov 26, 2026 09:01 AM IST

ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ఓటు హక్కు వినియోగించు కోసం క్యూ లో నిల్చున్న ఓటర్లు
ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ఓటు హక్కు వినియోగించు కోసం క్యూ లో నిల్చున్న ఓటర్లు

about 7 hours agoNov 26, 2026 09:00 AM IST

కురుపాం మండల కేంద్రం
కురుపాం మండల కేంద్రంలోని ఎం.పీ.యూ.పీ. పాఠశాలలో గురువారం జరుగుతున్న సర్పంచ్‌ ఎన్నికల్లో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌, జెడ్పీటీసీ సభ్యుడు వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు.

about 7 hours agoNov 26, 2026 08:52 AM IST

జిల్లా ఎన్నికల అబ్జర్వ్ టీ వెంకటేష్ కొత్తవలస మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలన
విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అబ్జర్వర్ టీ. వెంకటేష్‌

about 7 hours agoNov 26, 2026 08:51 AM IST

కనిగిరి మండలం తుమ్మగుంట
కనిగిరి మండలం తుమ్మగుంట పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు

about 7 hours agoNov 26, 2026 08:41 AM IST

kondapee.jpeg

కొండపి మండలం వెన్నూరులో వైసీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపిస్తున్న పోలీసులు

about 8 hours agoNov 26, 2026 08:37 AM IST

ఓటర్లు బారులు
కొత్తవలస మేజర్‌ పంచాయతీలో ఓటర్లు బారులు

ప్రజాశక్తి - కొత్తవలస : కొత్తవలస మేజర్‌ పంచాయతీలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ మందకొడిగా సాగుతోంది. వీల్‌చైర్లు అందుబాటులో లేకపోవడంతో వృద్ధులు, వికలాంగ ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.

about 8 hours agoNov 26, 2026 08:26 AM IST

రాయవరంలో ప్రారంభమైన పోలింగ్
రాయవరంలో ప్రారంభమైన పోలింగ్

about 8 hours agoNov 26, 2026 08:22 AM IST

annamaya.jpeg

బి.కొత్తకోటలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్‌

ప్రజాశక్తి - బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమైంది. 23 వార్డులకు 28 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు. డీఎస్పీ ప్రసాద్‌, సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేస్తున్నారు.

about 8 hours agoNov 26, 2026 08:18 AM IST

అడ్డతీగలలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
అడ్డతీగలలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

ప్రజాశక్తి - అడ్డతీగల : అడ్డతీగల జడ్పీ హైస్కూల్‌లోని ఒకటి నుంచి 8వ వార్డు వరకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

about 8 hours agoNov 26, 2026 08:04 AM IST

ఎల్విన్ పేటలో బారులు తీరిన ఓటర్లు

పార్వతిపురం మన్యం జిల్లాలోని ఎల్విన్ పేటలో బారులు తీరిన ఓటర్లు

about 8 hours agoNov 26, 2026 08:01 AM IST

శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలంలో
శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలంలోని లండారిపుట్టుగలో బారులు తీరిన ఓటర్లు

about 8 hours agoNov 26, 2026 07:59 AM IST

గవర్మపేటలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

గవర్మపేటలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

ప్రజాశక్తి - జియ్యమ్మవలస : పార్వతిపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం గవర్మపేటలో గురువారం సర్పంచ్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మహిళలు, పురుషులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

about 8 hours agoNov 26, 2026 07:58 AM IST

ఆత్మకూరు కేంద్రంలో  గ్రామ సర్పంచ్ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకోలేదు ఉదయం7.30 భారీగా తరలివచ్చి ఓటర్లు
ఆత్మకూరులో ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన ఓటర్లు

ప్రజాశక్తి - ఆత్మకూరు : ఆనంతపుంన జిల్లా ఆత్మకూరు గ్రామ సర్పంచ్‌ ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద గురువారం ఉదయం 7.30 గంటలకే ఓటర్లు భారీగా తరలివచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.

about 8 hours agoNov 26, 2026 07:51 AM IST

అడ్డతీగల జడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో 80 ఏళ్ల వయోవృద్ధురాలు

80 ఏళ్ల వయోవృద్ధురాలు ఓటు హక్కు వినియోగం

ప్రజాశక్తి - అడ్డతీగల :పోలవరం జిల్లాలోని అడ్డతీగల జడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో 80 ఏళ్ల వయోవృద్ధురాలు గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయస్సు మీద పడినా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు.

about 8 hours agoNov 26, 2026 07:50 AM IST

ఇచ్ఛాపురం లో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్. ఈదుపురం పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్.. ఈదుపురం పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

about 9 hours agoNov 26, 2026 07:31 AM IST

కురుపాంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

కురుపాం : పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలంలో గురువారం సర్పంచ్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. కురుపాం జిల్లా పరిషత్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయాన్నే పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. మహిళలు, పురుషులు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్