గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్
Live News

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల లైవ్‌ అప్‌డేట్‌

8 గంటల క్రితం

Urban local body polls in AP.. Voter turnout percentage recorded so far
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 07:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రంలో గురువారం నిర్వహించనున్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో 4 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఈ నెల 30న నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు.

Live Updates
40 minutes agoNov 26, 2026 03:29 PM IST

మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 1,50,199మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇప్పటివరకు 63.19 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

about 1 hour agoNov 26, 2026 03:23 PM IST

ఇప్పటివరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 56.38 శాతం పోలింగ్ నమోదు...

about 2 hours agoNov 26, 2026 02:08 PM IST

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పటి వరకు 50 శాతం ఓటింగ్ నమోదు..


వైసీపీ నాయకుడు వేమారెడ్డిని పోలింగ్ కేంద్రం నుండి బయటకి పంపేసిన పోలీసులు

వైసీపీ మేయర్ అభ్యర్థి చీఫ్ ఏజెంట్ గా వున్నా వేమారెడ్డి

టీడీపీ నేతల ఆదేశాలతో వేమారెడ్డిని పంపేసిన పోలిసులు


పోలింగ్ కేంద్రం వద్ద భారీగా టీడీపీ శ్రేణులు..

టీడీపీ శ్రేణులు గుమీ గుడి వున్నా పట్టించుకోని పోలీసులు..

గుమిగుడి వున్నా వీడియోస్ తీస్తున్న జర్నలిస్ట్ పై పోలీసుల బెదిరింపులు..

వీడియోస్ తీయొద్దు అంటూ హుకుం..

పోలింగ్ కేంద్రం వద్ద భారీగా టీడీపీ శ్రేణులు..

పట్టించుకోని పోలీసులు..

about 2 hours agoNov 26, 2026 02:06 PM IST

గుడివాడ పురపాలక సంఘ పరిధిలో నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్

1:00pm వరకు

మొత్తం ఓటర్ల సంఖ్య :-119594

పోలింగ్ అయిన ఓట్లు :-56,939

పోలింగ్ శాతం :- 47.61%

about 3 hours agoNov 26, 2026 01:18 PM IST

వనిత
మేము జనసేన వాళ్లం సార్.. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్.. వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలా చేయలేదు సార్ అంటూ పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేసిన జనసేన వీరమహిళ కోటా వినూత.

about 4 hours agoNov 26, 2026 12:35 PM IST

polling

పాలకొల్లు లో ప్రశాంతంగా మున్సిపల్ పోలింగ్

పాలకొల్లు : ‌పాలకొల్లు పట్టణంలోని 44 వార్డులలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11 గంటలకు 32. 53% ఓటర్లు తమ ఓట్ హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచి క్యూలలో నిల్చొని మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.మొదటి 2 గంటలు 14.5 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ హౌసింగ్ బోర్డ్ లోని మున్సిపల్ స్కూల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా ప్రశాంతంగా జరుగుతోందని మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు.

about 4 hours agoNov 26, 2026 12:21 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఎంఎస్ఎస్ నగర్ మంగళగిరి పోలింగ్ బూత్ 34 /3 నందు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.


పవన్‌ కల్యాణ్‌

about 4 hours agoNov 26, 2026 12:19 PM IST

ప్రకాశం జిల్లా కందుకూరులో 11 గంటలకు పోల్ పర్సంటేజ్
ప్రకాశం

about 4 hours agoNov 26, 2026 12:18 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ‌పాలకొల్లు పట్టణంలోని 44 వార్డులలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11 గంటలకు 32. 53% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

about 4 hours agoNov 26, 2026 12:18 PM IST

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి గ్రామపంచాయతీ పోరులో మొదటి విడతలో జరిగిన తాళ్లపూడి మండలంలో ఉదయం 11 గంటలకు 64% పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.

about 4 hours agoNov 26, 2026 12:10 PM IST

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు 11am 52%

ఆమదాలవలస మున్సిపాలిటీలో 11 గంటలకు 28 వార్డుల్లో 10748 ఓట్లు పోలై 32.50% నమోదైనట్లు అధికారులు తెలిపారు

about 4 hours agoNov 26, 2026 12:09 PM IST

11 గంటలకే 62.29 శాతం పంచాయతీ పోలింగ్‌

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో 22.55 శాతం

about 4 hours agoNov 26, 2026 12:00 PM IST

కృష్ణాజిల్లా.. తాడిగడప మున్సిపల్ ఎన్నికలు ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ 28.31 శాతం

about 4 hours agoNov 26, 2026 12:00 PM IST

తూర్పు గోదావరి జిల్లా దామిరెడ్డి పల్లి గ్రామంలో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదు..

about 4 hours agoNov 26, 2026 11:59 AM IST

కాకినాడ జిల్లా--గ్రామపంచాయతీ మొదటి విడత పోలింగ్ ఉ. 11 గం.ల వరకు మండలాల వరకు
కాకినాడ

about 4 hours agoNov 26, 2026 11:58 AM IST

కాకినాడ జిల్లా కాకినాడరూరల్

– తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు

కాకినాడ రూరల్ మండలంలో ఇప్పటివరకు 59.94 శాతం పోలింగ్ నమోదు.


కరప మండలంలో 56.16 శాతం పోలింగ్ నమోదు.

రెండు మండలాల్లోనూ కొనసాగుతున్న ఓటింగ్ ప్రక్రియ.


ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు.


గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల మధ్య నెలకొన్న ఉత్కంఠ.


పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు.


ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అధికారుల చర్యలు.


పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం

కాకినాడ రూరల్‌లో 59.94 శాతం, కరప మండలంలో 56.16 శాతం పోలింగ్ నమోదు కావడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

about 4 hours agoNov 26, 2026 11:58 AM IST

విజయనగరం జిల్లా కొత్తవలస మండల వ్యాప్తంగా 12 గంటలకి సుమారు 63% పోలింగ్ నమోదయింది

about 4 hours agoNov 26, 2026 11:57 AM IST

పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపాలిటీలో 11 గంటలకు 27.14 శాతం పోలింగ్...

ఓటు హక్కు వినియోగించుకున్న 29,232 మంది ఓటర్లు...

about 4 hours agoNov 26, 2026 11:56 AM IST

రెడ్డిగూడెం మండలం, శ్రీరాంపురం గ్రామంలో పోలింగ్ బూత్ లో జరిగిన గొడవలో గాయపడిన వైసీపీ ఏజెంట్ వెల్ది. రాంబాబు
వెల్ది రాంబాబు

about 4 hours agoNov 26, 2026 11:53 AM IST

అనంతపురం జిల్లా ఆత్మకూరు

అనంతపురం

about 4 hours agoNov 26, 2026 11:52 AM IST

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం లో ఉదయం 11 గంటలకు 56 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..

about 4 hours agoNov 26, 2026 11:51 AM IST

విజయనగరంలో 11 గంటల వరకు పోలింగ్‌ శాతం

విజయనగరం

about 4 hours agoNov 26, 2026 11:50 AM IST

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం పోలింగ్ వివరాలు
గండుపిల్లి

about 4 hours agoNov 26, 2026 11:49 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 11 గంటలకి 51.89.శాతం పోలింగ్

పలాస లో 64.52 శాతం

కవిటి లో 55.9% శాతం నమోదు

about 4 hours agoNov 26, 2026 11:45 AM IST

గ్రామపంచాయితీ ఎన్నికలు -2026 సామర్లకోట మండలం

ఉదయం 11:00 గం.ల వరకు పోలింగు నివేదిక

పురుషులు :- 21470

స్త్రీలు :: -22629

ఇతరులు ::0

మొత్తం :: 44099

పోలింగు శాతం :: 63%

about 4 hours agoNov 26, 2026 11:42 AM IST

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జిల్లా మామిడికుదురు అమలాపురం డివిజన్ లో 11 గంటలకి పోలింగ్ శాతం
01

about 4 hours agoNov 26, 2026 11:42 AM IST

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం 66.40% పోలింగ్‌

about 4 hours agoNov 26, 2026 11:41 AM IST

పొన్నూరులో 31.23% పోలింగ్

about 4 hours agoNov 26, 2026 11:41 AM IST

తిరుపతి జిల్లా...రేణిగుంట మండలంలో ఉదయం 11 గంటల వరకు 42 శాతం పోలింగ్ నమోదు

అనకాపల్లి చోడవరంలో... 41% పోలింగ్

about 4 hours agoNov 26, 2026 11:40 AM IST

శ్రీకాకుళం జిల్లా ఉదయం 11 గంటల వరకూ పోలింగ్‌ శాతాలు ...

మండలాల వారీగా పోలింగ్ శాతాలు...

మందస: 35.72% (23,740 ఓట్లు)

పలాస: 33.83% (9,551 ఓట్లు)

కంచిలి: 33.45% (15,963 ఓట్లు)

కవిటి: 31.18% (15,013 ఓట్లు)

సోంపేట: 28.87% (20,443 ఓట్లు)

ఇచ్ఛాపురం: 27.20% (12,777 ఓట్లు)

వజ్రపుకొత్తూరు: 25.77% (13,679 ఓట్లు)

about 4 hours agoNov 26, 2026 11:40 AM IST

తిరుపతి జిల్లా: తొట్టంబేడు మండలంలో ఉదయం 11 గంటల వరకు 71% శాతం పోలింగ్

విజయనగరం జిల్లా: వేపాడ మండలంలో ఉదయం 11 గంటలకి 55.54% ఓటింగ్ పోలింగ్

తూర్పుగోదావరి జిల్లా: కొవ్వూరు మండలంలో 11 గంటలకు 64.83 శాతం

about 5 hours agoNov 26, 2026 11:39 AM IST

గుంటూరు

about 5 hours agoNov 26, 2026 11:38 AM IST

టి. సుండుపల్లి మండలం రాయవరంలో జోరుగా పోలింగ్.. ఇప్పటివరకు 63 శాతం ఓటింగ్ నమోదు!

2,336 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగం.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి!

కడప జిల్లా, టి.సుండుపల్లి మండలం రాయవరం గ్రామపంచాయతీలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.

గ్రామంలో మొత్తం 2,336 ఓట్లు పోలైనట్లు సమాచారం. ఇప్పటివరకు 63 శాతం పోలింగ్ నమోదైంది.

ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపిస్తుండగా, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.

గ్రామంలో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

about 5 hours agoNov 26, 2026 11:37 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో 11 గంటలకి 51.89.శాతం పోలింగ్

about 5 hours agoNov 26, 2026 11:37 AM IST

కోనసీమ

about 5 hours agoNov 26, 2026 11:36 AM IST

అంబేద్కర్‌ కోనసీమ - మామిడికుదురు మండలంలోని 16 గ్రామాలలో ఉదయం 11 గంటల సమయానికి 52% ఓటింగ్ పూర్తయింది.

about 5 hours agoNov 26, 2026 11:35 AM IST

తిరుపతి జిల్లా నాగలాపురం పోలింగ్ శాతం
లిస్టు

about 5 hours agoNov 26, 2026 11:34 AM IST

ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ — ఉదయం 11:00 గంటల వరకు 43.06% పోలింగ్ నమోదు: జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
మండలాల వారీగా ..

జి.కొండూరు మండలం: 51.69%

మైలవరం మండలం: 50.43%

ఇబ్రహీంపట్నం మండలం: 49.87%

రెడ్డిగూడెం మండలం: 48.04%

విజయవాడ రూరల్ మండలం: 34.80%

about 5 hours agoNov 26, 2026 11:14 AM IST

కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగనాథనహళ్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల పోలింగ్ వేళ టీడీపీ, వైసిపి నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓటర్లను వైసిపి నాయకులు ప్రలోభపెడుతున్నారంటూ టీడీపీ నేతల ఆరోపిస్తున్నారు. ఇరుపార్టీల నాయకుల మధ్య మాటామాటా, భారీగా పోలీసులు మోహరించారు.


about 5 hours agoNov 26, 2026 11:13 AM IST

కర్నూలు జిల్లా మండగిరి పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, బుద్ధారెడ్డి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. రెబల్ అభ్యర్థి మురళికి ప్రచారం చేస్తున్నారంటూ బుద్ధారెడ్డి ఆగ్రహించారు. సర్పంచ్ అభ్యర్థిగా బుద్ధారెడ్డి భార్య శ్రీదేవి పోటీ చేస్తున్నారు. ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత జరిగింది. సీఐ జోక్యంతో వివాదం సద్దుమణిగింది.


about 5 hours agoNov 26, 2026 11:10 AM IST

అనకాపల్లి జిల్లా..: సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామంలో 10 గంటలకు 85% పోలింగ్ జరిగింది
సత్యసాయి జిల్లా..: ముదిగుబ్బ : 10గంటలకు 50.49% పోలింగ్ జరిగింది.
ఎన్టీఆర్‌ జిల్లా..: మైలవరం మండలంలో 10 గంటల వరకు 50.43 శాతం పోలింగ్ నమోదయింది.
ప.గో జిల్లా పెనుగొండ మండలంలో ఉదయం 10 గంటలకు 30% పోలింగ్ నమోదయింది.


about 5 hours agoNov 26, 2026 11:07 AM IST

అనంతపురం రూరల్‌ పంచాయతీలో దొంగ ఓట్ల కలకలం రేగింది. పోలింగ్‌ కేంద్రాలకు నకిలీ ఓటరు కార్డులతో మహిళలు వచ్చి ఓట్లు వేస్తుండగా వైసిపి ఏజెంట్లు పట్టుకున్నారు.

about 5 hours agoNov 26, 2026 11:05 AM IST

నంద్యాల జిల్లా జి.జంబులదిన్నె పోలింగ్‌ కేంద్రం దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ రాజుకుంది. ఇరుపార్టీల కార్యకర్తలు కారం నీళ్లు చల్లుకున్నారు. దీంతో పోలింగ్‌ కేంద్రానికి అధికారులు తాళాలు వేశారు.

about 5 hours agoNov 26, 2026 11:05 AM IST

పంచాయతీ ఎన్నికలలో బయట వ్యక్తుల హల్చల్

అన్నమయ్య జిల్లా : బి.కొత్తకోట నగర పంచాయతీ ఎన్నికలలో బయట వ్యక్తులు హల్చల్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద రిగ్గింగ్ చేసేందుకు పాల్పడుతున్న వ్యక్తులను వైసిపి శ్రేణులు పట్టుకున్నారు. బయట వ్యక్తులను బస్సులు, ఆటోలలో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుండగా వైసిపి నేతలు పట్టుకున్నారు.


about 5 hours agoNov 26, 2026 11:04 AM IST

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్రిక్తత

శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో జనరల్ ఏజెంట్గా ఉన్న మాజీమంత్రి ధర్మాన.. మాజీ మంత్రి ఇంటికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మేయర్ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి చేరుకున్నారు. ధర్మాన ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

about 5 hours agoNov 26, 2026 11:03 AM IST

రాజమండ్రి లో 11.56 శాతం పోలింగ్

రాజమండ్రిలో తొలి రెండు గంటల్లో 11.56 శాతం పోలింగ్ నమోదు. పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరిన ఓటర్లు. రెండు బ్యాలెట్ల పైన ఓటు వేయడానికి సరిపడే విధంగా స్టాంప్యాడ్ లు లేవంటున్న ఓటర్లు.

about 5 hours agoNov 26, 2026 11:02 AM IST

బ్యాలెట్ బాక్స్ లోకి ఇంకు పోసిన ఇద్దరు వ్యక్తులు

సత్యసాయి : కనగానపల్లి మండలం నరసంపల్లి పంచాయతీ లో 6 , 8 వార్డు నెంబర్ల బూతులలో బ్యాలెట్ బాక్స్ లోకి ఇద్దరు వ్యక్తులు ఇంకు పోశారు. దీంతో పోలింగ్ ఆగిపోయింది. పోలీసులు విచారణ చేపట్టారు

about 5 hours agoNov 26, 2026 10:56 AM IST

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో 10 గంటలకు పోలింగ్ పర్సంటేజ్

పలమనేరు... 34.68%

గంగవరం...37.65%

బైరెడ్డిపల్లి...40.78%

పెద్ద పంజాని...41.34%

వి కోట...33.61%

about 5 hours agoNov 26, 2026 10:55 AM IST

తురవగల్లులో పోలింగ్‌కు దూరంగా గ్రామస్థులు

కర్నూలు జిల్లా : తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదంటూ పోలింగ్‌కు గ్రామస్థుల దూరం

స్థానికులతో మాట్లాడుతున్న సర్పంచ్‌ అభ్యర్థులు

about 5 hours agoNov 26, 2026 10:53 AM IST

జమ్ములదిన్నెలో తాత్కాలికంగా ఆగిన పోలింగ్‌

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జమ్ములదిన్నెలో ఉద్రిక్తత 

 వైసిపి మద్దతుదారులు రిగ్గింగ్‌ చేస్తున్నారని అడ్డుకున్న టిడిపి మద్దతుదారులు

 పోలింగ్‌ కేంద్రం వద్ద కారంపొడి చల్లుకొని ఇరువర్గాలు పరస్పరం దాడి  

 తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేసిన అధికారులు 


about 5 hours agoNov 26, 2026 10:58 AM IST

స్టాంప్యాడ్‌ల సమస్య :

ప్రజాశక్తి రాజమహేంద్రవరం సిటీ: రెండు బ్యాలెట్ల పైన ఓటు వేయడానికి సరిపడే విధంగా స్టాంప్యాడ్ ఇంకురాటలేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఎగస్ట్రా స్టాంప్యాడ్ అయినా సరే, లేదా ఇంకు అయినా సరే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఓటర్ల అభిప్రాయం. మరోవైపు పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదని నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ ఫోన్లు భద్రపరుచుకునేందుకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయవలసింది అయితే నగరంలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఈ సదుపాయం లేకపోవడంతో వాటర్లు ఇబ్బంది పడుతున్నారు.

about 5 hours agoNov 26, 2026 10:57 AM IST

పొన్నూరు మున్సిపాలిటీలో.....

ఉదయం 9 గంటల వరకు 13.99 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40 వార్డుల్లో 80 పోలింగ్ కేంద్రాల పరిధిలో 60,200 మంది ఓటర్లకు గాను 8,423 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తుండటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది. అన్ని కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుండగా, ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

about 5 hours agoNov 26, 2026 10:55 AM IST

రాజమహేంద్రవరంలో 9 గంటలకు 11.56 శాతం పోలింగ్

ప్రజాశక్తి–రాజమహేంద్రవరం ప్రతినిధి: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో గురువారం ఉదయం 9 గంటల నాటికి 11.56 శాతం పోలింగ్ నమోదైంది. నగరంలోని 72 డివిజన్లలో మొత్తం 4,63,323 మంది ఓటర్లకు గాను 53,565 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ శాతం వివరాలను ప్రతి రెండు గంటలకు ఒకసారి వెల్లడించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

about 5 hours agoNov 26, 2026 10:47 AM IST

కృష్ణాజిల్లా.. తాడిగడప మున్సిపల్ ఎన్నికలు...

ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. 13.73 శాతం

about 5 hours agoNov 26, 2026 10:47 AM IST

కృష్ణాజిల్లా.. గుడివాడ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో మొదటి దశ గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలకు వరకు 10.5 శాతం నమోదు అయ్యింది..

about 6 hours agoNov 26, 2026 09:47 AM IST

బాపట్ల పురపాలక సంఘం పరిధిలో 41  వార్డు  పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు.

బాపట్ల పురపాలక సంఘం పరిధిలో 41 వార్డు పోలింగ్ కేంద్రాల్లో ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు.

about 7 hours agoNov 26, 2026 09:38 AM IST

నరసరావుపేట స్థానిక ఎన్నికల లో భాగంగా ఓటు వేసిన శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు
నరసరావుపేట స్థానిక ఎన్నికల్లో భాగంగా శాసనసభ్యుడు డాక్టర్‌ చదలవాడ అరవింద్‌బాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు

about 7 hours agoNov 26, 2026 09:36 AM IST

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్పొరేషన్ పరిధిలో 9 గంటలకు 13.93 శాతం పోలైంది.

about 7 hours agoNov 26, 2026 09:28 AM IST

కాకినాడ నగర పాలక సంస్థ
కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా ప్రతాప్ నగర్ శ్రీమతి లక్ష్మీ మాలకొండయ్య నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలోని ఓటు హక్కును వినియోగించు కుంటున్న కాకినాడ పట్టణ ప్రజలు.

about 7 hours agoNov 26, 2026 09:27 AM IST

mla
కుమారుడితో కలిసి ఓటు వేసిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు

ప్రజాశక్తి - భీమవరం: భీమవరం మున్సిపల్‌ ఎన్నికల్లో 32వ వార్డు పోలింగ్‌ కేంద్రంలో భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కుమారుడు ప్రశాంత్‌తో కలిసి సాధారణ ఓటర్లతో పాటు క్యూ లైన్‌లో నిలబడి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను గుర్తించి, నిర్భయంగా పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

about 8 hours agoNov 26, 2026 08:35 AM IST

సీకే గర్ల్స్‌ హైస్కూల్‌
సీకే గర్ల్స్‌ హైస్కూల్‌ వద్ద ఓటర్ల బారులు

ప్రజాశక్తి - మంగళగిరి : మంగళగిరి పట్టణంలోని సీకే గర్ల్స్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్ద గురువారం ఉదయం 7 గంటలకే ఓటర్లు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారు.

about 8 hours agoNov 26, 2026 08:19 AM IST

cbn

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు

ప్రజాశక్తి - మంగళగిరి : మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాదె రామయ్య సీతారామమ్మ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి కలిసి ఓటు వేశారు. అలాగే మంత్రి నారా లోకేష్‌ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్