గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionప్రశాంతంగా ముగిసిన పోలింగ్ : డిజిపి హరీష్ కుమార్ గుప్తా

1 గంట క్రితం

DGP Harish Kumar Gupta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిటిసి, జెడ్‌‌పిటిపి ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని డిజిపి హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాల వద్ద 40,679 మంది సిబ్బందితో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి కడప, అనంతపురం, కర్నూలు, తదితర మొత్తం 15 జిల్లాల నుంచి మొత్తం 37 ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసుశాఖ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. ప్రతి ఘటనలో వాస్తవ పరిస్థితులను, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను గుర్తించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. అలాగే పోలింగ్ పూర్తయిన అనంతరం పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు అత్యంత పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య సురక్షితంగా తరలించేలా ఏర్పాట్లు చేశామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్