శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిషత్ పోలింగ్ వేళ.. రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు

18 గంటల క్రితం

Tensions in several parts of the state during Parishad polling
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ఎపి లో ‘పరిషత్‌’ పోలింగ్‌ కొనసాగుతున్న వేళ ... పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్సార్‌ కడప జిల్లా, తిరుపతి జిల్లాల్లో పెట్రోల్‌ బాంబులతో దాడులు జరిగాయి. పులివెందుల మండలం ఎర్రిపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి-వైసిపి బాహాబాహీకి దిగాయి. పోలింగ్‌ కేంద్రంలోనికి వెళ్లే విషయంలో టిడిపి, వైసిపి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పెట్రోల్‌ బాంబులు వేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని నల్లపురెడ్డిపల్లెలోనూ పోలింగ్ బూత్ లోనికి వెళ్లే విషయంలో వైసిపి, టిడిపి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రానికి సమీపంలో పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారు. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు .... కడప జిల్లా నందలూరులోనూ ఉద్రిక్తత ఏర్పడింది. తిరుపతి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం వాహనాల్లో అక్కడికి వచ్చారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్‌కు తరలించారు. ఇదిలా ఉండగా .... పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లిలో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రంలోనికి వెళ్లే విషయంలో వైసిపి-టిడిపి మధ్య ఘర్షణ రాజుకుంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి, జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరుపార్టీల నేతలు పరస్పరం నెట్టుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్