శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటు వేసి పెళ్లిపీటలు ఎక్కిన యువతి

13 గంటల క్రితం

ఓటు వేసి పెళ్లిపీటలు ఎక్కిన యువతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 07:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి – గరుగుబిల్లి (పార్వతీపురం మన్యం జిల్లా) : ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత ముందుండాలని నవ వధువు గొట్టిపిల్లి వాణి తన ఆచరణతో చాటి చెప్పారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆమె తమ కన్నవారింటి వద్ద ఓటు వేసి వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లిలో గురువారం చోటు చేసుకుంది. జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి గ్రామానికి చెందిన యువకుడితో వాణికి గురువారం రాత్రి వివాహం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఉదయమే వరుడు ఇంటికి కుటుంబ సభ్యులు, బంధువులతో చేరుకోవాల్సి ఉంది. పెళ్లి కూతురుగా ముస్తాబైన ఆమె ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం పెద్దబుడ్డిడి గ్రామంలో జరుగనున్న వివాహ వేడుకకు హాజరయ్యారు.

నవవధూవరులు ఓటు

విజయనగరం జిల్లా రేగిడి మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన నూతన వధూవరులకు గురువారం ఉదయం వివాహమైంది. అనంతరం పెళ్లిదుస్స్తుల్లోనే వచ్చి వారు సంకిలి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్