భువనేశ్వర్ : ఒడిశా మయూర్‌భంజ్‌లోని రైరంగపూర్‌లో శనివారం జరిగిన వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ 47,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో వెనుకబడిన తూర్పు భారతదేశం ఇప్పుడు అభివృద్ధికి, పురోగతికి ద్వారంగా ఎదుగుతోంది. ఒడిశా వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోంది. తూర్పు భారతదేశ అభివృద్ధి ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయాలన్నది కేంద్రం లక్ష్యం. అందుకే మేము 'పూర్వోదయ' (తూర్పు, ఈశాన్యప్రాంతాల అభివృద్ధికి కేంద్రం చేపట్టిన ఆర్థిక విధానం) విధానంపై పని చేస్తున్నాము. ఒడిశాలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర వనరులను అవకాశాలుగా మార్చుకుంటోంది. ఒడిశా వద్ద ఇంకా రూ. 20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలున్నాయి’ అని మోడీ అన్నారు. అలాగే ఈరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె ఒడిశా అస్తిత్వాన్ని బలోపేతం చేశారని మోడీ అన్నారు.
ఒడిశాలో 47 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోడీ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 06:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)