లాపాజ్ : బొలీవియా అధ్యక్షుడు రోడ్రిగో పాజ్ శనివారం దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఏడువారాలుగా కొనసాగుతున్న ఆందోళనలు, రహదారుల దిగ్భందనలతో దేశంలో రవాణాకు అంతరాయం ఏర్పడిందని, దైనందిన జీవితం తీవ్రంగా ప్రభావితమైందని ఆరోపించారు. ఈ చర్య సాధారణ పరిస్థితులను దెబ్బతీయడానికి కాదని, వాటిని పునరుద్ధరించేందుకేనని ఆయన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ఆందోళనకారులతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. రహదారులను దిగ్బంధించడం, ఆస్తులను ధ్వంసం చేయడం, దాడులు చేయడం, బెదిరించడం వంటి చర్యలకు చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. బొలీవియన్ వర్కర్స్ సెంట్రల్ (సిఒబి) ప్రభుత్వంతో ఒప్పందం కుదరడంతో తమ ఆందోళనలను నిలిపివేస్తున్నట్లు బొలీవియన్ వర్కర్స్ సెంట్రల్ (సిఒబి ) ప్రకటించింది. అయితే టుపాక్ కటారి రైతుల సమాఖ్య సహా ఇతర సంస్థలు ఆందోళనలను కొనసాగించాలని నిర్ణయించాయి.
బొలీవియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోడ్రిగో పాజ్
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 20, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)