చెన్నై : తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహమైన పురుష ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పితృత్వ సెలవులను ఉద్యోగులు బిడ్డ పుట్టడానికి ముందు లేదా బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల్లోపు తీసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగుల అభ్యర్థనల మేరకు పురుష ఉద్యోగులకు పితృత్వ సెలవులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
పితృత్వ సెలవులు మంజూరు చేసిన విజయ్ ప్రభుత్వం
27 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 03:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)