శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - దేశవ్యాప్తంగా అన్నదాతల ఆందోళన

14 నిమిషాల క్రితం

Concern among food donors across the country
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 12:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎసెకెఎం) దేశవ్యాప్త నిరసనను ప్రారంభించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగిన నిరసన ప్రదర్శనలలో రైతులు మోడీ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టబద్ధత, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలిపివేత, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయకూడదని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవడం వంటి డిమాండ్లతో పాటు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఎస్ఐర్ రద్దు, ఢిల్లీలోని జంతర్మంతర్ను శాంతియుత నిరసనలకు కేటాయించాలని వంటి డిమాండ్లను కూడా లేవనెత్తారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్