మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Duleep Trophy final: కష్టాల్లో సౌత్ జోన్..

1 గంట క్రితం

Duleep Trophy final
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొలి ఇన్నింగ్స్ 242/6

ఈస్ట్‌ జోన్‌తో జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ 2026 ఫైనల్లో మూడో రోజు ఆట ముగిసింది. సౌత్‌ జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది. ఈస్ట్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఆ జట్టు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది. ప్రస్తుతం తిలక్‌ 56, చామ మిలింద్‌ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. రికీ భుయ్‌ 1, నారాయణ్‌ జగదీశన్‌ 32, షేక్‌ రషీద్‌ 27, స్మరణ్‌ రవిచంద్రన్‌ 23, శ్రేయస్‌ గోపాల్‌ 26 పరుగులు చేసి ఔటయ్యారు. ఈస్ట్‌ జోన్‌ బౌలర్లలో షమీ, ముకేశ్‌ కుమార్‌ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్‌ మోహన్‌, ఖురేషి చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్‌ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్‌ (72), శిఖర్‌ మోహన్‌ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్‌ సూర్యవంశీ (44), అనుకూల్‌ రాయ్‌ (45), కౌనైన్‌ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్