మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నూతన పింఛన్ల నమోదు ప్రక్రియను పరిశీలన

1 గంట క్రితం

pension
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 05:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కలకడ : నూతన పింఛన్ల నమోదు ప్రక్రియను పరిశీలించినట్లు డిప్యూటీ ఎంపీడీవో చక్రపాణి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఏడవ తేదీ నుండి నూతన పింఛన్లను నమోదు చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేయడంతో పింఛన్లకు అర్హులైన వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, సంబంధిత స్వర్ణ గ్రామ సచివాలయాల నందు నూతన పింఛన్ల ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మండలంలోని కలకడ, బాలయ్యగారిపల్లి, బాటవారిపల్లి పంచాయతీలలో జరుగుతున్న నూతన పింఛన్ల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు. పింఛన్ల నమోదు కార్యక్రమానికి వస్తున్న వారిని ఇబ్బంది కలిగించకుండా, వారిని అగౌరవ పరచకుండా, సామరస్యంగా నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు నూతన పింఛన్‌దారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్