శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionIND vs NZ 2nd Test: డబ్ల్యుటిసి ఫైనల్ బెర్త్‌ లక్ష్యంగా...

9 గంటల క్రితం

IndianPlayers.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 01:57 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేటినుంచి న్యూజిలాండ్‌ రెండో, చివరి టెస్ట్‌

  • ఉదయం 3.30గం.లకు

క్రైస్ట్‌చర్చ్‌: తొలి టెస్ట్‌ను డ్రా చేసుకున్న టీమిండియా.. రెండో టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటిసి) 2027‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే టీమిండియాకు గెలుపు తప్పనిసరి. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా వెల్లింగ్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌ను డ్రా గా ముగించిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి జరిగే ఆఖరి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌‌లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచ్‌‌ను గెలవడం భారత్‌కు అత్యంత కీలకం. ఈ టెస్టును టీమిండియా డ్రా చేసుకున్నా.. ఓటమిపాలైనా డబ్ల్యుటిసి ఫైనల్ ఆశలు అడియాశలవుతాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు క్రైస్ట్‌చర్చ్ వాతావరణం భారత్‌ను కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. గురువారం ఆకస్మికంగా కురిసిన వర్షం కారణంగా భారత ప్రాక్టీస్ సెషన్‌కు అంతరాయం కలిగింది. ఆ తర్వాత వర్షం నిలవడంతో భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. రెండో టెస్ట్ జరిగే ఐదు రోజుల పాటు చల్లని గాలులు వీచనున్నట్లు.. తొలి మూడు రోజులు వర్షం ప్రభావం లేకపోయినా.. నాలుగో రోజు ఆట చివరి భాగంలో వర్షం కురిసే ఉన్నట్లు సమాచారం. తొలి టెస్ట్‌లో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, రెండో టెస్ట్ పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో ఫలితం రావడం ఖాయం. క్రైస్ట్‌చర్చ్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని, అదనపు వేగంతో పాటు బౌన్స్ లభిస్తుందని న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ తెలిపాడు. కానీ ఈ వేదికగా జరిగిన భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆ టెస్టులో నాలుగు శతకాలు నమోదయ్యాయి. టెస్ట్‌ మ్యాచ్‌ కొనసాగేకొద్దీ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. పేసర్లకు స్వర్గధామమైన క్రైస్ట్‌చర్చ్‌ టెస్టులో మహ్మద్‌ సిరాజ్‌ను ఆడిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చని, గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

జట్లు(అంచనా)...

ఇండియా: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌, పడిక్కల్‌, పంత్‌ (వికెట్‌ కీపర్‌), సుందర్‌, జురెల్‌, ఆకాశ్‌ దీప్‌, కాంబోజ్‌, బుమ్రా, ప్రసిద్.

న్యూజిలాండ్‌: లాథమ్‌(కెప్టెన్‌), బ్లండెల్‌(వికెట్‌ కీపర్‌), కాన్వే, నికోల్స్‌, రచిన్‌ రవీంద్ర, మిఛెల్‌, ఫిలిప్స్‌, జేమీసన్‌, హెన్రీ, డఫీ, ఫిషెర్‌.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్