mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'1000 గోల్స్' చేరువలో క్రిస్టియానో రొనాల్డో

3 గంటల క్రితం

ronaldo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 11:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హ్యూస్టన్: ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 1000 గోల్స్ మైలురాయికి మరింత చేరువయ్యాడు. ప్రస్తుతం అతని కెరీర్ గోల్స్ సంఖ్య 975కి చేరగా, ఈ ఘనతను అందుకోవడానికి ఇంకా 25 గోల్స్ మాత్రమే అవసరం. ప్రపంచకప్‌లో ఉజ్బెకిస్తాన్‌పై రెండు గోల్స్ చేసిన అనంతరం రొనాల్డో తన ప్రదర్శనతో మరోసారి వార్తల్లో నిలిచాడు. అతను జాతీయ జట్టు తరఫున ఇప్పటివరకు 230 మ్యాచ్‌లలో 145 గోల్స్ సాధించాడు. ఈ గోల్స్‌తో రొనాల్డో పలు రికార్డులు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గోల్‌ చేయడం ద్వారా వరుసగా ఆరు ప్రపంచకప్ లలో 2006 (1), 2010 (1), 2014 (1), 2018 (4), 2022 (1), 2026 (2) గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా రొనాల్డో కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ చేసిన రెండవ అతిపెద్ద వయస్కుడిగానూ రొనాల్డో (41 ఏళ్ల 138 రోజులు) రికార్డు సృష్టించాడు. తొలి స్థానం కామెరూన్ దిగ్గజం రోజర్ మిల్లా(42 ఏళ్ల 39 రోజులు) పేరిట ఉంది. వరుసగా ఆరు ప్రపంచకప్‌లలో గోల్స్ చేసిన ఆటగాడిగా నిలవడంతో పాటు, పోర్చుగల్ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డును కూడా తన పేరున నమోదు చేసుకున్నాడు.

అతని తొలి ప్రపంచకప్ గోల్ 2006లో ఇరాన్‌పై నమోదైంది. మొత్తం ప్రపంచకప్‌లలో అతను 10 గోల్స్ వేయడం విశేషం. ఈ క్రమంలో పోర్చుగల్ లెజెండ్ యూసెబియో (9 గోల్స్) రికార్డును కూడా అతను అధిగమించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్