mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదరగొట్టిన కొలంబియా

7 గంటల క్రితం

fifa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 02:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హ్యూస్టన్: గ్రూప్‌-కె చివరి లీగ్‌ ‌మ్యాచ్‌‌లో కొలంబియా జట్టు శుభారంభం చేసింది. గురువారం ఉదయం ఉజ్బెకిస్థాన్‌పై ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన కొలంబియా 3-1గోల్స్‌ ‌తేడాతో ఉజ్బెకిస్తాన్‌‌ను ఓడించింది. మెక్సికోలోని ఎస్టాడియో అజ్టెకా వేదికగా కొలంబియా, ఉజ్బెకిస్థాన్ తొలి అర్ధభాగంలో హోరాహోరీగా తలపడ్డాయి. లూయిస్‌ డియాజ్‌ ఇచ్చిన పాస్‌ను 40వ నిమిషంలో డానియల్‌ మునోజ్‌ గోల్‌గా చేయడంతో కొలంబియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత రెండో అర్ధ భాగంలో ఉజ్బెకిస్థాన్‌ 60వ నిమిషంలో కొట్టి సంచలనం నమోదు చేసింది. అబోస్బెక్‌ ఫేజులేవ్‌ ఉజ్బెకిస్థాన్‌ తరఫున ప్రపంచకప్‌లో తొలి గోల్‌ చేసిన అరుదైన ఘనత సాధించాడు. గోల్ చేసిన సంతోషం మాత్రం ఉజ్బెకిస్థాన్‌కు ఎంతో సేపు నిలవలేదు. డియాజ్‌ 65వ నిమిషంలో గోల్‌ కొట్టి కొలంబియాను 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. జామిన్‌టన్‌ క్యాపేజ్‌ అదనపు సమయంలో మరో గోల్‌ కొట్టి కొలంబియా విజయాన్ని ఖరారు చేశాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్