న్యూయార్క్ : కాన్సాస్ సిటీ స్టేడియంలో బుధవారం జరిగిన ఫిఫా ప్రపంచ కప్-2026 గూప్-జె లీగ్ మ్యాచ్ లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సి హ్యాట్రిక్ గోల్స్ తో రాణించాడు. అల్జీరియాపై అర్జెంటీనా 3-0తో విజయం సాధించగా.. ఈ మూడు గోల్స్ మెస్సీనే కొట్టాడు. దీంతో మెస్సీ తమ తొలి మ్యాచ్‌లోనే హ్యాట్రిక్‌తో మెరిసి అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఆట ప్రారంభమైన 17వ నిమిషంలోనే మెస్సి మాయ మొదలైంది. తొలి అర్ధభాగంలో అర్జెంటీనా ఒక గోల్ చేయడంతో 1-0 ఆధిక్యం సాధించింది. ఇక రెండో అర్ధభాగంలో మెస్సి మరింత చెలరేగాడు. 60వ నిమిషంలో, 76వ నిమిషంలో మరో రెండు గోల్స్ కొట్టగాడు దీంతో ప్రపంచ కప్ చర్రితలో మెస్సి తొలిసారి హ్యాట్రిక్ గోల్స్ తో మెరిసాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టేడియంలోని ప్రేక్షకులు నిల్చొని చప్పట్లతో మెస్సిని అభినందించారు. ఇక మెస్సీ ఫిఫా ప్రపంచకప్ ఐదింట్లోనూ గోల్స్ చేసిన జర్మనీ ఆటగాడు క్లోస్ సరసన చేరాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సి భావోద్వేగానికి గురయ్యాడు. వ్యక్తిగతంగా కొన్ని రోజులు ఇబ్బంది పడినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాచ్ పోస్ట్ ప్రెజెంటేషన్‌లో వెల్లడించాడు.
ఫ్రాన్స్ అలవోకగా...
న్యూజెర్సీ వేదికగా జరిగిన మరో మ్యాచ్ లో 2022 ఫిఫా ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ జట్టు 3-1 గోల్స్ తేడాతో సెనెగల్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ కిలియన్ ఎంబాపే రెండు గోల్స్‌తో చెలరేగిపోయాడు. ఈ విజయంతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో అర్ధభాగంలో 66వ నిమిషంలో జూల్స్ కౌండే అందించిన అద్భుతమైన త్రో బాల్‌ను అందుకున్న ఎంబపే ఓ వైపు మూల నుండి అద్భుతంగా గోల్ చేసి ఫ్రాన్స్‌కు తొలి ఆధిక్యాన్ని అందించాడు. మ్యాచ్ మొత్తం బాక్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నించిన అతను, ఆ క్షణాన్ని మాత్రం ఏమాత్రం వృథా చేయలేదు. ఆ గోల్ తర్వాత ఫ్రాన్స్ మరింత దూకుడుగా ఆడింది. బ్రాడ్లీ బార్కోలా చక్కటి ఫినిష్‌తో మరో గోల్ సాధించి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అయితే అదనపు సమయంలో సెెనెగల్ తరఫున ఎంబాయే గోల్ చేయడంతో స్కోరు 2-1గా మారి మ్యాచ్‌లో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ సెెనెగల్ పునరాగమన ఆశలు ఎక్కువసేపు నిలవలేదు. కొద్ది సేపటికే ప్రమాదకరమైన ప్రాంతంలో బంతిని అందుకున్న ఎంబాపే, దూరం నుంచి బలమైన షాట్‌తో మరో గోల్ సాధించాడు. ఆ గోల్ ప్రత్యర్థి గోల్కీపర్ను దాటి నేరుగా నెట్ లోకి చేరడంతో ఫ్రాన్స్ విజయం ఖరారైంది. ఈ మ్యాచ్‌లో చేసిన గోల్‌తో ఎంబాపే ఫ్రాన్స్ పురుషుల జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఒలివియర్ గిరౌడ్ పేరిట ఉన్న 57 గోల్స్ రికార్డును అధిగమించి, కేవలం 99 మ్యాచ్‌ల్లోనే 58 గోల్స్ నమోదు చేశాడు. గిరౌడ్ ఈ మార్కును చేరుకోవడానికి 137 మ్యాచ్‌లు ఆడారు. సెెనెగల్పై సాధించిన గోల్‌తో ఎంబాపే తన మొత్తం వరల్డ్ కప్ గోల్స్ సంఖ్యను 14కు చేర్చుకున్నాడు. దీంతో ఫ్రాన్స్ దిగ్గజం జస్ట్ ఫాంటైన్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి, వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రెంచ్ ఆటగాడిగా నిలిచాడు.









కామెంట్లు (0)