mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐదుగురు సభ్యులతో జనసేన కమిటీ

1 రోజు క్రితం

janasena
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఆ పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఈ కమిటీ సభ్యులను ఖరారు చేశారు. కమిటీలో తమ్మిరెడ్డి శివశంకరరావు, పెదపూడి విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, బుర్రా దివ్యరాజ్, పెనుగొండ సుబ్బారాయుడు సభ్యులుగా నియమితులయ్యారని తెలిపింది. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభం సోమవారం నుంచి కానుంది. ఈ ప్రక్రియను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ కమిటీ పర్యవేక్షిస్తూ సమన్వయం చేయనుంది. జనసేన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్