టెహ్రాన్ : అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు తరలించారు. టెహ్రాన్ నుంచి ఫిబ్రవరి 28 న ఆయన హత్యకు గురైన ప్రదేశానికి ఖమేనీ పార్థీవదేహాన్ని చేర్చారు. ‘‘ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన అమరత్వం పొందిన ప్రదేశానికి తరలించారు’’ అని ఇరాన్ మీడియా వెల్లడించింది. అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం కొన్ని రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా .... టెహ్రాన్‌లో జులై 4, 5 తేదీల్లో జరగనున్న ఖమేనీ అంతిమయాత్రకు రికార్డు స్థాయిలో రెండుకోట్ల మంది వస్తారని ఐఆర్‌జిసి అంచనా వేస్తుంది. ఈ అప్రకటిత యాత్రకే భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మద్దతుదారులు నలుపు రంగు దుస్తుల్లో వచ్చి నివాళులు అర్పించారు. పలువురు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇక ఈ నెల తొమ్మిదో తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర జరగనుంది. ఆ రోజున ఖమేనీ స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, బ్యానర్లు వెలిశాయి. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇరాన్ నుంచి భారత ప్రధాని మోడికి ఆహ్వానం వచ్చింది. మన దేశం తరఫున కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది.
హత్యకు గురైన ప్రదేశానికి ఖమేనీ భౌతికకాయం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 08:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)