శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జులై 5 న నా పెళ్లి : ఆమిర్ ఖాన్

2 గంటల క్రితం

జులై 5 న నా పెళ్లి : ఆమిర్ ఖాన్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 09:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ జులై 5 న వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు తాజాగా ఆమిర్ ఖాన్ మీడియాతో వెల్లడించారు. ‘‘ జులై 5 నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. మా ఇంట్లోనే చిన్న వేడుకగా పెళ్లి చేసుకుంటున్నాం. ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు, మిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి. మా వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని దీవించండి ’’ అని ఆమిర్‌ ఖాన్‌ కోరారు. ఈ విషయం చెప్పిన అనంతరం ప్రెస్‌మీట్‌లో ఆమిర్‌ పక్కనే ఉన్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి విషెస్‌ తెలిపారు. ఆమిర్ ఖాన్‌కు గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో వివాహం జరిగింది. ఆ తర్వాత వారు విడిపోయారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ఆయన కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్