శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పెళ్లింట విషాదం - చిన్నారి సహా నలుగురు మృతి

2 గంటల క్రితం

పెళ్లింట విషాదం - చిన్నారి సహా నలుగురు మృతి
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 09:42 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రకాశం : ప్రకాశం జిల్లా కంభం పరిధిలో జరిగిన దుర్ఘటన ఒక కుటుంబానికి తీవ్ర విషాదాన్ని నింపింది. అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి 1:15 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి కూడా మృతి చెందడం అందరినీ కలచివేసింది. మృతుల్లో అంకాలు (22), అతని భార్య అలకనంద (18), నాగేశ్ (18) ఉన్నారు. పోలీసుల వివరాల మేరకు .... గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్‌కు చెందిన కొందరు బంధువులు పెళ్లి వేడుకల కోసం కంభంకు వచ్చారు. రాత్రి సమయంలో వారు సమీపంలోని వినాయక స్వామి గుడిని దర్శించుకోవడానికి ఆటో రిక్షాలో వెళ్లారు. గుడి వద్దకు చేరుకున్న తర్వాత కొందరు ఆటో నుంచి దిగగా, మరికొందరు ఆటోలోనే కూర్చుని ఉన్నారు. అదే సమయంలో, మదనపల్లె నుండి తెలంగాణలోని వైరాకు కొబ్బరి పీచు ఎరువు లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆటోను వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరగడం, చిన్నారి నాగాలక్ష్మి (4) తీవ్రంగా గాయపడడం, ఆమెను కంభం ఆసుపత్రికి తరలించినప్పటికీ, మార్గమధ్యంలోనే ఆమె మరణించడం ఆ కుటుంబానికి తీవ్ర ఆవేదనను కలిగించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లికూతురు వీరక్కతో పాటు మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సంజీవరాయుడు, వీరయ్య, ఓలమ్మల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కంభం సిఐ మల్లికార్జున్, ఎస్‌ఐ శివకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్