థాయిలాండ్ : రోడ్డు పక్కనే నడుస్తున్న సాధువులపై 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్కు దూసుకెళ్లిన ఘటన గురువారం ఈశాన్య థాయిలాండ్‌లో జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది సాధువులు మృతి చెందారు. రాజధాని బ్యాంకాక్‌కు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముక్దహాన్ ప్రావిన్స్‌కు చెందిన 35 మంది సాధువులు రహదారికి ఒకవైపు వరుసగా ఒకరి వెనుక మరొకరు నడుచుకుంటూ తీర్థయాత్రకు వెళుతున్నారు. ఈ బృందంపై 11 ఏళ్ల బాలుడు నడుపుతున్న పికప్ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గురువారం స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు సాధువులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. గాయాలతో చికిత్స పొందుతున్న 13 మంది సాధువుల్లో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన 11 ఏళ్ల బాలుడిని పోలీసులు అరెస్టు చేసి ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
ఘోర ప్రమాదం - 9 మంది సాధువులు మృతి - బాలుడు అరెస్ట్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 09:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)