mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనీలి మేఘం వచ్చింది

4 గంటల క్రితం

kavitha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 30, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నీలి మేఘం వచ్చింది

చల్లని వర్షం కురిసింది

వసుంధరంతా తడిసింది

మామిడి విత్తనం మొలకెత్తింది

రెండు ఆకులు వేసింది

రోజుకు కొంత పెరిగింది

మెండుగా కొమ్మలు వేసింది

కొమ్మకు పువ్వు పూసింది

పువ్వుకు పిందే కాసింది

పిందే కాయ అయ్యింది

కాయ పండై మగ్గింది

మగ్గిన పండు రాలింది

రాలిన పండును పాప చూసింది

పరుగున దగ్గరకు వెళ్లింది

పండును చేత పట్టింది

గబగబా ఇంటికి వచ్చింది

అమ్మకు పండు ఇచ్చింది

అమ్మ పండు కోసింది

చక్కగా ముక్కలు చేసింది

ఇంటిల్లిపాదికీ ఇచ్చింది

నోరు తీపి అయ్యింది

- జాధవ్ పుండలిక్ రావు పాటిల్

94413 33315


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్