పుట్లూరులోని అంగడిలో పదివేల రూపాయలు నగదు, సిగరెట్లు ప్యాకీలు చోరీ
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలో వరుసగా చోరీలు జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం పట్టించుకున్న పాపానపోలేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రంలో గురువారం రాత్రి రాజ కుళ్లాయప్ప అంగట్లో పదివేల రూపాయలు పైగానే నగదు, సిగరెట్లు ప్యాకెట్లు చోరీకి గురయ్యాయి. కులాయప్ప అంగడి ముందరే ఉన్న విద్యుత్ స్తంభానికి రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి పనిచేయకపోవడంతో సీసీ కెమెరాలు ఉన్నా కూడా నిరుపయోగంగా మారాయి. ముఖ్యంగా మండలంలోని అంగళ్లలో చోరీలు జరిగినప్పటికీ నామమాత్రంగానే పోలీసులు చొరవ చూపుతున్నారు. అందుకు నిదర్శనం కోమటికుంట్ల గ్రామంలో నీ అంగట్లో డబ్బులు చోరీకి గురైతే అక్కడ ఉన్న సిసి ఫుటేజీలో దొంగ స్పష్టంగా కనపడినప్పటికీ దొంగను పట్టుకొని రికవరీ చేయాల్సిన పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. అంతకుముందు మండల కేంద్రంలోని నారాయణస్వామి అంగట్లో నగదు తో పాటు సిగరెట్ ప్యాకెట్లు 15వేల రూపాయలకు పై గానే ఎత్తుకెళ్లినప్పటికీ రికవరీలో సగం డబ్బులు మాత్రమే రికవరీ చేశామని పోలీసులు ప్రెస్ మీట్ లో తెలిపారు. కానీ సంవత్సరం కావస్తున్న ఇంతవరకు అతనికి డబ్బులు ఇచ్చిన దాఖలాలు కనిపించలేదు. మండలంలో ఎక్కడో చోట వారానికి ఒకసారి చోరీలు జరుగుతూనే ఉన్నాయి . కానీ పోలీసులు వాటిపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.









కామెంట్‌లు (0)