mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర సబ్ జూనియర్ ఫుట్బాల్ ఫుట్బాల్ పోటీలకు చాగల్లు విద్యార్థులు

1 గంట క్రితం

chagallu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 11:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి చాగల్లు : జూన్ 18వ తేదీన రాజమండ్రిలో జరిగిన జిల్లా సబ్ జూనియర్ ఫుట్బాల్ ఎంపికలలో చాగల్లు మండలం చాగల్లు జడ్పీహెచ్ఎస్  విద్యార్థులు పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుని జె. విజయలక్ష్మి తెలిపారు. ఎంపికైన వాళ్లలో డి .జయదుర్గ,కె. కౌసల్య, ఎస్. యామిని, పి . అనూష, ఎస్ పావని ఉన్నారని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు జూలై 3 తేదీ నుండి 5 జూలై వరకు నంద్యాలలో జరుగుతాయని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయిని వి. వాసవి, ఉపాధ్యాయ సిబ్బంది, ఎస్ఎంసి చైర్మన్ నందిని, గ్రామస్తులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్