16 సచివాలయాల పరిధిలో 73 వేల మంది ప్రజలకు సేవలు
గర్భిణీల ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): మంగళం ప్రాంతంలో స్థానిక ప్రజలతో పాటుగా 16 సచివాలయాల పరిధిని కలుపుతూ దాదాపుగా 73000 మందికి వైద్య సేవలు అందిస్తోంది మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దినదినాభివృద్ధి చెందుతూ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య సేవలో తీసుకొచ్చే మార్పులు, పల్స్ పోలియో, గర్భిణీల ఆరోగ్యానికి ప్రాధాన్యతతో కూడిన ప్రధమ వైద్య సేవలను, మాత శిశు మరణాలు జరగకుండా ప్రతినెల అవసరమైన అన్ని స్కానింగ్ లను తీస్తున్నామని మంగళం ప్రాథమిక కేంద్రం వైద్యాధికారిణి స్రవంతి ప్రజాశక్తి వివరించారు. ప్రపంచ వైద్యుల దినోత్సవ సందర్భంగా ప్రజాశక్తితో మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ప్రజలకు అందుతున్న సేవలను వివరించారు.
తిరుమలలో కూడా.....
మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రాంతాలతో పాటుగా తిరుమలలో కూడా వైద్య సేవల కార్యక్రమాలు నిర్వహిస్తాము. ప్రతిరోజు 85 నుంచి 90 మంది సగటున వైద్య సేవల కోసం మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. మంగళం పిహెచ్సిలో ఉన్న ల్యాబ్ ద్వారా మధుమేహం, రక్తపోటు, ఈసీజీ, సిబిసి, ఆర్ఎఫ్ టి, ఎల్ఎఫ్ టి, ఆర్టిపిసిఆర్ ద్వారా టీబి నిర్ధారణ, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నాం.
గర్భిణీల ఆరోగ్యం కోసం.....
గర్భవతుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ద్వారా గర్భవతులకు ప్రతినెలా తొమ్మిదవ తేదీ వైద్య పరీక్షల కోసం స్విమ్స్ లేదా ఇక్కడి డాక్టర్లు ప్రత్యేక పరీక్షలను నిర్వహించడం జరుగుతోంది. ప్రతి గురువారం గర్భవతులకు ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తున్నాం. మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2025 నుంచి 2026 జూన్ మాసం ముగిసే వరకు పదుల సంఖ్యలో ఇక్కడే కాన్పులను చేస్తున్నాము. ప్రత్యేకంగా ఈడిడి పట్టిక ద్వారా హై రిస్క్ కేసెస్ నువ్వు ప్రత్యేకంగా పరిగణిస్తూ వారికి అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు, స్కానింగ్, బిపి, షుగర్ పరీక్షలను నిర్వహిస్తున్నాం.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే.....
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్క కాటుకు ఎక్కువ సంఖ్యలో ఏఆర్ యు వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఒక ఏడాదికి నాలుగు నుంచి ఐదువేల మంది కుక్కకాటు బాధితులు మంగళం ఆరోగ్య కేంద్రం పరిధి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తుంటారు. నెలకు సగటున స్థానికులతో కలుపుకొని 300 కుక్క కాటు బాధితులు ఆరోగ్య కేంద్రంకు వస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు 2023 నుండి 24 గంటలు, వారం రోజులు మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రజలకు వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. మంగళం చుట్టుపక్కల ప్రాంత ప్రజల కోసం ఆరోగ్య కేంద్రంలోనే ఒక 108 వాహనం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
173 రకాల మందుల పంపిణీ.....
మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా 173 రకాల మందులను ప్రజలకు వారి అనారోగ్య సమస్యలు తగ్గడానికి పంపిణీ చేస్తున్నాం. దీంతోపాటుగా 44 సర్జికల్ ఐటమ్స్ ప్రభుత్వ నుండి సరఫరా అవుతుంది. టీబి ముక్త్ భారత్ అభియాన్ ద్వారా టీబి రోగులు 55 మందికి వైద్య సేవలు కిట్లను అందిస్తున్నాం.

ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.....
ప్రజలు వారి సొంత ఆలోచనలతో ఆరోగ్యంలో ఏదైనా మార్పులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత ఆలోచనలు, ఏముందిలే అనే ఏమరపాటు చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి అనారోగ్య సమస్యలను ముందస్తుగానే తెలుసుకొని తగిన వైద్య సేవలు పొందాలి. చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ముఖ్యంగా కుక్క కాటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులను సంప్రదించండి.
-డాక్టర్ స్రవంతి, వైద్యాధికారిణి, మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.









కామెంట్‌లు (0)