mh ad
బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రోగుల ప్రాణ రక్షణే వారి ధ్యేయం ..... వైద్యుల శ్రమే సమాజ ఆరోగ్య భాగ్యం...

3 గంటల క్రితం

doctor
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 08:31 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మామిడికుదురు: వైద్యో నారాయణో హరి అన్న నానుడి నిజం. రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు చేసే నిరంతర సేవకు ఈ మాత్రపు గుర్తింపు చాలాదేమో. ప్రతి వృత్తి దేనికదే చాటి అయినప్పటికీ వైద్యవృత్తి వాటికి భిన్నమైనది. చివరి అంచుల దాకా వెళ్లిన వారికి ప్రాణం పోచే శక్తి ఈ వృత్తికి ఉంటుంది.అందుకే వైద్యవృత్తి పవిత్రమైనది. నిబద్ధత, త్యాగ నిరతి వైద్యులకు ఉండాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని పక్కకు పెట్టేసి తెల్లకోటు కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఎదుటి వ్యక్తి ప్రా ణాలు కాపాడటానికి తపన పడేవాడే నిజమైన వైద్యుడు. మానవసేవే మాధవ సేవ అన్నట్లు సాగే వైద్య వృత్తిలో ఎంతగా సేవా నిరతి కలిగి ఉంటే అంతటి గొప్ప వ్యక్తిగా గుర్తింపు. డాక్టర్లకు సహనం ఓర్పు, సేవానిరతి, దయ ఉండాలి... అప్పుడే రాణిస్తారు. వైద్యుడు ఎల్లప్పుడూ ఏఐఆర్ అనుసరించాలి ఏ అంటే Availability అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి ఏ అత్యవసర పరిస్థితుల్లోనైనా తనకు వైద్యం చేసే డాక్టర్ అందుబాటులో ఉంటాడన్న నమ్మకం రోగికి కలిగేటట్లు వైద్యులు మెలగాలి.

ఐ - అంటే Interest.. తను చేస్తున్న వృత్తిమీద వైద్యులకు అబిరుచి, నమ్మకం ఉండాలి... ఏదో జీవనోపాధి కోసం పనిచేయకూడదు. ఆర్ అంటే Regularity తను చేస్తున్న పనికి ఒక క్రమబద్ధత ఉండాలి. నిర్దిష్టమైన టైం టేబుల్ ఉండాలి. ప్రతి డాక్టరు ఎల్లప్పుడు రోగికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు. పీజు తీసుకున్నా... తీసుకోకపోయినా.... తను చేసే సేవ ఒకేలా ఉంటుంది. రోగికి వైద్యుడికి నడుమ నమ్మకం అనే బంధం ఉండాలి.


వైద్యుల కోసం ఒకరోజు అందరికీ ఆదర్శం..

అనుక్షణం ఆరోగ్యాన్ని శారీరక మానసిక సైర్యాన్ని అందించే ఈ వైద్య నారాయణ లకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి.? డాక్టర్ చికిత్స చేశారు - రోగి పీజు చెల్లించాడు అనుకుంటే ఆ ప్రాణదాత రుణం తీరిపోతుందా? ఈ బంధం తెగిపోతుందా?ఆ దాత పోసిన ఊపిరి అనుక్షణం కృతజ్ఞతలు నింపుకునే పదేపదే గుర్తు చేస్తూ ఉండదు? అందుకే ఈ వైద్యం కోసం ప్రపంచమంతా ఒకరోజు కేటాయించింది. అదే" ప్రపంచ డాక్టర్ డే దినోత్సవం. " వాళ్లను గుర్తుపట్టేందుకు ఈ రోజున డాక్టర్లందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలు,, సిరి సంపదలతో చల్లగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాము.


వైద్యుల రక్షణ చట్టాలు మరియు సామాజిక సవాళ్లు...

ప్రత్యుత్త ఆధునిక కాలంలో వైద్య వృత్తి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఆస్పత్రులలో సిబ్బందిపై జరుగుతున్న దాడులు కొన్నిసార్లు త్రీవమైన అనారోగ్య పరిస్థితుల వల్ల రోగులు మరణించినప్పుడు వారి బంధువులు ఆసుపత్రులపై మరియు డాక్టర్లపై భౌతిక దాడులకు దిగడం ఈ ప్రమాదాల నుండి వైద్యులను రక్షించడం కోసం ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకువచ్చింది. మెడికల్ ప్రొఫెషనల్ ప్రోటేషన్ ఆక్ట్ ప్రకారం వైద్యులపై లేదా ఆస్పత్రుల ఆస్తులపై దాడులు చేయడం త్రీ వమైన నాన్బెయిలబుల్ ప్రకారం దాని కింద జరిమానా తో పాటు జైలు శిక్ష విధించారు వైద్యులు ప్రశాంతమైన వాతావరణంలో పని చేసినప్పుడే వారు రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించగలరనేది చట్టబద్ధమైన వాస్తవం.


వైద్య వృత్తి అనేది కేవలం డబ్బు సంపాదించే వ్యాపారం కాదు.

వైద్య వృత్తి మానవత్వముతో కూడిన ఒక అత్యున్నతమైన సేవా యజ్ఞం జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది నిరంత శ్రమను ను వారి త్యాగాలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ సగర్వముగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ప్రతిష్ట మైన వైద్య ఆరోగ్య రంగం ద్వారానే భారతదేశం ఆరోగ్యవంతమైన మరియు శక్తివంతమైన దేశంగా నిలబడటం సాధ్యమవుతుంది

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్